టాలీవుడ్ దర్శకుడు త్రివిక్రమ్ సినిమాలు గతంలో ఉన్నట్లుగా లేవని అజ్ఞాతవాసి - అరవింద సమేత సినిమాలు గట్టిగానే చెప్పేశాయి. అయితే నెక్స్ట్ బన్నీతో ఒక సినిమాను సెట్స్ పైకి తీసుకెళుతోన్న సంగతి తెలిసిందే.  ఏప్రిల్ 24న సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలవ్వనుంది. అయితే ఈ సినిమా చుట్టూ అజ్ఞాతవాసి పోలికలతో ఉన్న కొన్ని రూమర్స్ వైరల్ గా మారాయి. 

మెయిన్ గా టైటిల్ విషయం ఒకటైతే.. ఇంకోటి త్రివిక్రమ్ కాంబో టెన్షన్. పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి టైటిల్ ను ముందే సీక్రెట్ గా రివీల్ చేసిన దర్శకుడు అభిమానులు బావుందని చెప్పడంతో చివరకు అదే ఫిక్స్ చేశాడు. ఇక ఇప్పుడు అలాంటి ఫార్ములానే వాడుతున్నారు. నాన్న - నేను అనే టైటిల్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిన సంగతి తెలిసిందే. 

అయితే చిత్ర యూనిట్ ఇంకా ఈ విషయంలో క్లారిటీ ఇవ్వలేదు. అజ్ఞాతవాసి సినిమా అప్పుడు చెప్పకుండా ఉండి సినిమాపై గట్టి బజ్ క్రియేట్ చేశారు. అయితే సినిమా ఊహించని విధంగా డిజాస్టర్ అయ్యింది. ప్లానింగ్ బాగానే వర్కౌట్ అయ్యింది కాబట్టి నాన్న - నేను అనే టైటిల్ విషయంలో కూడా త్రివిక్రమ్ నోరుమెదపడం లేదు. 

ఇక కాంబినేషన్ రూమర్ అనేది పెద్దగా పట్టించుకోవాల్సిన విషయం కానప్పటికీ కొన్ని వెబ్ సైట్ లు అభిమానులు ఆందోళనలో ఉన్నట్లు రాసేస్తున్నారు. జల్సా - అత్తరింటికి దారేది సినిమాల తరువాత త్రివిక్రమ్ పవన్ తో చేసిన అజ్ఞాతవాసి డిజాస్టర్ అయినట్టే.. జులాయి - సన్ ఆఫ్ సత్యమూర్తి అనంతరం అదే తరహాలో బ్యాడ్ సెంటిమెంట్ ను ఈ కాంబో గుర్తుచేస్తోందని టాక్ వస్తోంది. అయితే ఒక సినిమా అలా రివర్స్ అయినంత మాత్రానా అన్ని అలా అవ్వవని రూమర్స్ క్రియేట్ చేసేవారు తెలుసుకుంటే మంచిది.