ఎన్టీఆర్ దేవర మూవీపై ఫ్యాన్స్ ఫిదా అయ్యే కామెంట్స్ చేశాడు ఉమర్ సంధు. ఆయన ట్వీట్ వైరల్ అవుతుండగా ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.  


దేవర (Devara)షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. చెప్పిన తేదీకి విడుదల చేయాలని మేకర్స్ నిరవధికంగా చిత్రీకరణ జరుపుతున్నారు. 2024 ఏప్రిల్ 5 దేవర విడుదల తేదీగా ప్రకటించారు. దేవర షూటింగ్ లో బిజీగా ఉన్న జూనియర్ ఎన్టీఆర్(NTR)... తాత ఎన్టీఆర్ వంద రూపాయల నాణెం లాంచింగ్ కార్యక్రమంలో కూడా పాల్గొనలేదు. దర్శకుడు కొరటాల శివ భారీ బడ్జెట్ తో దేవర తెరకెక్కిస్తున్నారు. దాదాపు రూ. 300 కోట్ల బడ్జెట్ కేటాయించినట్లు సమాచారం. 

ఇదిలా ఉంటే ఓవర్సీస్ సెన్సార్ సభ్యుడు, ఫిల్మ్ క్రిటిక్ ఉమర్ సంధు దేవర మూవీ గురించి అదిరిపోయే మాట చెప్పాడు. పది సెకండ్స్ రష్ చూశాను. నా మైండ్ బ్లాక్ అయ్యింది. ఎన్టీఆర్ లుక్ అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతుంది. ఈ ఎపిక్ సాగా కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నాను, అని ట్వీట్ చేశాడు. ఉమర్ సంధు ట్వీట్ మూవీపై అంచనాలు పెంచేసింది. 

Scroll to load tweet…

ఇక ఉమర్ సంధు వివాదాస్పద పోస్ట్స్ తో ఎప్పుడూ వార్తలో ఉంటాడు. హీరోలు హీరోయిన్స్ మధ్య ఎఫైర్స్ పుకార్లు రాజేస్తూ సెన్సేషన్స్ క్రియేట్ చేస్తుంటాడు. ఊర్వశి రాతెలా, పూజా హెగ్డేల మీద కూడా ఉమర్ సంధు అనుచిత కామెంట్స్ చేయగా వారు చట్టపరమైన చర్యలకు పాల్పడ్డారు. 

ఇక దేవర విషయానికి వస్తే ఎన్టీఆర్ కి జంటగా జాన్వీ కపూర్ నటిస్తుంది. ఆమెకు ఇది ఫస్ట్ సౌత్ ఇండియన్ మూవీ. సైఫ్ అలీ ఖాన్ విలన్ రోల్ చేస్తున్నారు. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు. ఆచార్య మూవీతో విమర్శలపాలైన కొరటాల శివ కసిగా దేవర తెరకెక్కిస్తున్నారు. దేవర చిత్రం సాగర తీరం నేపథ్యంలో సాగనుంది. ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేస్తున్నాడనే ప్రచారం జరుగుతుంది.