Asianet News TeluguAsianet News Telugu

ఓటీటితో `బాహుబలి` నిర్మాతకు టేబుల్ ప్రాఫిట్

ఆర్కా మీడియా వ‌ర్క్స్, మ‌హాయాణ మోష‌న్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్స్‌పై శోభు యార్ల‌గ‌డ్డ‌, ప్ర‌సాద్ దేవినేని, విజ‌య ప్ర‌వీణ ప‌రుచూరి నిర్మాత‌లుగా `కేరాఫ్ కంచ‌పాలెం` ఫేమ్ వెంక‌టేశ్ మ‌హ ద‌ర్శ‌క‌త్వంలో `ఉమామ‌హేశ్వ‌ర ఉగ్ర‌రూపాశ్య‌` టైటిల్ తో ఓ  సినిమాను రూపొందించారు. మ‌ల‌యాళ హీరో ఫాహ‌ద్ ఫాజిల్ హీరోగా న‌టించిన హిట్ చిత్రం `మ‌హేశింతే ప్ర‌తీకార‌మ్‌` చిత్రాన్ని వెంకటేశ్ మ‌హ తెలుగులో రీమేక్ చేసారు. ఈ చిత్రం అతి త్వరలో డిజిటిల్ స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ నేపధ్యంలో ఈ చిత్రంపై ఎంత పెట్టారు...లాభం వచ్చిందా..నష్టం వచ్చిందా వంటి విషయాలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. 

Uma Maheswara Ugra Roopasya Table Profit
Author
Hyderabad, First Published Jun 15, 2020, 10:39 AM IST

ఆర్కా మీడియా వ‌ర్క్స్, మ‌హాయాణ మోష‌న్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్స్‌పై శోభు యార్ల‌గ‌డ్డ‌, ప్ర‌సాద్ దేవినేని, విజ‌య ప్ర‌వీణ ప‌రుచూరి నిర్మాత‌లుగా `కేరాఫ్ కంచ‌పాలెం` ఫేమ్ వెంక‌టేశ్ మ‌హ ద‌ర్శ‌క‌త్వంలో `ఉమామ‌హేశ్వ‌ర ఉగ్ర‌రూపాశ్య‌` టైటిల్ తో ఓ  సినిమాను రూపొందించారు. మ‌ల‌యాళ హీరో ఫాహ‌ద్ ఫాజిల్ హీరోగా న‌టించిన హిట్ చిత్రం `మ‌హేశింతే ప్ర‌తీకార‌మ్‌` చిత్రాన్ని వెంకటేశ్ మ‌హ తెలుగులో రీమేక్ చేసారు. ఈ చిత్రం అతి త్వరలో డిజిటిల్ స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ నేపధ్యంలో ఈ చిత్రంపై ఎంత పెట్టారు...లాభం వచ్చిందా..నష్టం వచ్చిందా వంటి విషయాలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. 

'కేరాఫ్ కంచరపాలెం' తో పరిచయం అయిన దర్శకుడు వెంకటేష్ మహా రెండో సినిమా కావటంతో ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. దాంతో నెట్ ప్లిక్స్ వారు ఈ సినిమాని మంచి రేటు పెట్టి తీసుకున్నారని సమాచారం.  డబ్బింగ్ రైట్స్,నిర్మాణం అన్ని కలిపి ఈ సినిమాపై మూడున్నర కోట్లు పెట్టారట. ఇప్పుడు నెట్ ప్లిక్స్ వారు నాలుగు కోట్లు ఇచ్చారట. అంతేకాకుండా మరో కోటిన్నర ఈ సినిమా శాటిలైట్ రైట్స్ నిమిత్తం రానుంది. 
 
ఇక `మ‌హేశింతే ప్ర‌తీకార‌మ్‌` ... గత పదేళ్లకాలంలో వచ్చిన గొప్ప మలయాళ చిత్రాల్లో ఒకటి.  ఈ సినిమాలో సత్యదేవ్ ను హీరోగా చేసారు. 
ఇస్మార్ట్ శంకర్, రాగల 24 గంటల్లో లాంటి సినిమాలతో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు సత్యదేవ్. జస్ట్ 36 రోజుల్లో ఈ సినిమా షూటింగ్ పూర్తిచేశారు. పోస్ట్ ప్రొడక్షన్ పూర్తిచేసారు. 

నిర్మాత‌ శోభు యార్ల‌గ‌డ్డ మాట్లాడుతూ – “వెంక‌టేశ్ మ‌హ మ‌న తెలుగు నెటివిటీకి త‌గ్గ‌ట్టు సినిమాను సెన్సిబుల్‌గా తెర‌కెక్కించ‌గ‌ల ద‌ర్శ‌కుడు. మల‌యాళంలో విజ‌య‌వంతమైన `మ‌హేశింతే ప్ర‌తీకార‌మ్` చిత్రాన్ని తెలుగు ప్రేక్ష‌కులు మెచ్చేలా త‌ను తెర‌కెక్కించ‌గ‌ల‌డ‌ని న‌మ్మ‌కంతో సినిమాను స్టార్ట్ చేశాం“ అన్నారు.

స‌త్య‌దేవ్ కంచ‌ర‌న, న‌రేష్‌, సుహాస్‌, జ‌బ‌ర్‌ద‌స్త్ రాంప్ర‌సాద్‌, కరుణాకరణ్, టి.ఎన్‌.ఆర్‌, ర‌వీంద్ర విజ‌య్‌, కె.రాఘ‌వ‌న్ త‌దిత‌రులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: బిజ్‌బ‌ల్‌, కెమెరా: అప్పు ప్ర‌భాక‌ర్‌, ద‌ర్శ‌క‌త్వం: వెంక‌టేశ్ మ‌హ‌, నిర్మాత‌లు: శోభు యార్ల‌గ‌డ్డ‌, ప్రసాద్ దేవినేని(ఆర్కా మీడియా వ‌ర్క్స్‌), విజ‌య ప్ర‌వీణ ప‌రుచూరి(మ‌హాయాణ మోష‌న్ పిక్చ‌ర్స్‌).

Follow Us:
Download App:
  • android
  • ios