Asianet News TeluguAsianet News Telugu

`ఉమామ‌హేశ్వ‌ర..` కు ఎంతొచ్చింది, లాభమేనా?

మరోసారి  'ఉమామ‌హేశ్వర ఉగ్రరూపశ్య' రూపంలో ఇండస్ట్రీకి మంచి లెస్సన్ నేర్పినట్లైంది. బాహుబలి లాంటి సినిమాని తీసి తెలుగు చిత్ర పరిశ్రమన్ని తలెత్తుకునేలా చేశారు నిర్మాతలు శోభు యార్లగ‌డ్డ, ప్రసాద్ దేవినేని. ఈ సినిమా తర్వాత తొందరపడకుండా కంటెంట్ బేస్ మూవీస్ చేసేందుకు ప్రయత్నాలు చేశారు. అందులో భాగంగానే కంచ‌రపాలెం లాంటి చిన్న సినిమా తీసి పెద్ద హిట్టు కొట్టిన దర్శకుడు వెంకటేష్ మహాతో కలిసి 'ఉమామ‌హేశ్వర ఉగ్రరూపశ్య' అనే సినిమాని చేసారు.

Uma Maheswara Ugra Roopasya Big Profit in ott
Author
Hyderabad, First Published Aug 10, 2020, 8:39 AM IST

సరైన కంటెంట్ ఉన్న సినిమాని, మంచి ఆర్టిస్ట్ కలిస్తే థియోటరే అక్కర్లేదు...ఓటీటిల్లోనూ దుమ్ము రేపుతుందని చాలా సార్లు ప్రూవైంది. తాజాగా మరోసారి  'ఉమామ‌హేశ్వర ఉగ్రరూపశ్య' రూపంలో ఇండస్ట్రీకి మంచి లెస్సన్ నేర్పినట్లైంది. బాహుబలి లాంటి సినిమాని తీసి తెలుగు చిత్ర పరిశ్రమన్ని తలెత్తుకునేలా చేశారు నిర్మాతలు శోభు యార్లగ‌డ్డ, ప్రసాద్ దేవినేని. ఈ సినిమా తర్వాత తొందరపడకుండా కంటెంట్ బేస్ మూవీస్ చేసేందుకు ప్రయత్నాలు చేశారు. అందులో భాగంగానే కంచ‌రపాలెం లాంటి చిన్న సినిమా తీసి పెద్ద హిట్టు కొట్టిన దర్శకుడు వెంకటేష్ మహాతో కలిసి 'ఉమామ‌హేశ్వర ఉగ్రరూపశ్య' అనే సినిమాని చేసారు.

ఇటీవ‌లే ఓటీటీ ద్వారా `ఉమామ‌హేశ్వ‌ర ఉగ్ర రూప‌స్య‌` ప్రేక్షకుల ముందుకు వ‌చ్చింది . స‌త్య‌దేవ్ న‌టించిన ఈ సినిమాలో అతని న‌ట‌న‌, ద‌ర్శ‌కుడు క‌థ‌ని న‌డిపించిన విధానం, నేటివిటీ.. ఇవ‌న్నీ ప్రేక్ష‌కుల్ని క‌ట్టిప‌డేశాయి. మంచి రివ్యూలు వ‌చ్చాయి. అందుకు తగ్గట్లే సోష‌ల్ మీడియాలోనూ ఈ సినిమా గురించి డిస్కషన్ జరిగింది. చాలా మంది... సినిమా సెల‌బ్రెటీలు ట్వీట్లు చేశారు. దాంతో ఈ చిన్న సినిమా ఒక్కసారిగా పెద్ద సినిమా అయ్యింది. ఈ సినిమా కేవలం ప్రశంసలే కాకుండా కమ‌ర్షియ‌ల్ గానూ ఈ సినిమా లాభాల పంట పండిందని ట్రేడ్ వర్గాల సమాచారం.

స్ట్రీమింగ్ చేసిన నెట్ ఫ్లిక్స్ వారికి ఈ సినిమాకి 1.5 కోట్ల వ‌ర‌కూ వ‌చ్చిన‌ట్టు చెప్తున్నారు.  దాంతో ఈ సినిమా బ‌డ్జెట్ దాదాపు ఓటీటీ ద్వారా వ‌చ్చేసిన‌ట్టైంది. మరో ప్రక్క రీసెంట్ గా  ఈ సినిమా శాటిలైట్ హ‌క్కుల్ని ఈటీవీ సొంతం చేసుకుంది. శాటిలైట్ రూపంలో మ‌రో 1.5 కోట్లు వ‌చ్చాయ‌ని వినికిడి. ఆ లెక్క‌లు చూస్తే .. శాటిలైట్ ద్వారా వ‌చ్చిందంతా లాభ‌మే .

 ఆర్కా మీడియా వ‌ర్క్స్, మ‌హాయాణ మోష‌న్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్స్‌పై శోభు యార్ల‌గ‌డ్డ‌, ప్ర‌సాద్ దేవినేని, విజ‌య ప్ర‌వీణ ప‌రుచూరి నిర్మాత‌లుగా `కేరాఫ్ కంచ‌పాలెం` ఫేమ్ వెంక‌టేశ్ మ‌హ ద‌ర్శ‌క‌త్వంలో `ఉమామ‌హేశ్వ‌ర ఉగ్ర‌రూపాశ్య‌` టైటిల్ తో ఈ సినిమాను రూపొందించారు. మ‌ల‌యాళ హీరో ఫాహ‌ద్ ఫాజిల్ హీరోగా న‌టించిన హిట్ చిత్రం `మ‌హేశింతే ప్ర‌తీకార‌మ్‌` చిత్రాన్ని వెంకటేశ్ మ‌హ తెలుగులో రీమేక్ చేసారు.  

స‌త్య‌దేవ్ కంచ‌ర‌న, న‌రేష్‌, సుహాస్‌, జ‌బ‌ర్‌ద‌స్త్ రాంప్ర‌సాద్‌, కరుణాకరణ్, టి.ఎన్‌.ఆర్‌, ర‌వీంద్ర విజ‌య్‌, కె.రాఘ‌వ‌న్ త‌దిత‌రులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: బిజ్‌బ‌ల్‌, కెమెరా: అప్పు ప్ర‌భాక‌ర్‌, ద‌ర్శ‌క‌త్వం: వెంక‌టేశ్ మ‌హ‌, నిర్మాత‌లు: శోభు యార్ల‌గ‌డ్డ‌, ప్రసాద్ దేవినేని(ఆర్కా మీడియా వ‌ర్క్స్‌), విజ‌య ప్ర‌వీణ ప‌రుచూరి(మ‌హాయాణ మోష‌న్ పిక్చ‌ర్స్‌).

Follow Us:
Download App:
  • android
  • ios