నేడు ఉగాది పండుగను పురస్కరించుకొని ఆర్ ఆర్ ఆర్ నుండి అద్భుతమైన పోస్టర్ విడుదల చేశారు. పంచకట్టులో ఎన్టీఆర్, ప్యాంటు, షర్ట్ లో ఉన్న రామ్ చరణ్ పండగను సంబరంగా జరుపుకుంటున్నారు.
ఆర్ ఆర్ ఆర్ మూవీ అంటే ఆ హైప్ వేరు. టాలీవుడ్ కి చెందిన ఇద్దరు టాప్ స్టార్స్ నటిస్తున్న ఈ చిత్రాన్ని దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించడం విశేషం. కాగా నేడు ఉగాది పండుగను పురస్కరించుకొని ఆర్ ఆర్ ఆర్ నుండి అద్భుతమైన పోస్టర్ విడుదల చేశారు. పంచకట్టులో ఎన్టీఆర్, ప్యాంటు, షర్ట్ లో ఉన్న రామ్ చరణ్ పండగను సంబరంగా జరుపుకుంటున్నారు. తమ చుట్టూ ఉన్న ప్రజలు వారిద్దరిని గాల్లో ఎగరేస్తున్నారు.
ప్రజలందరూ కలిసి ఓ పెద్ద విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నట్లు ఆ పోస్టర్ చూస్తే అర్థం అవుతుంది. మరి కొమరం భీమ్, రామరాజు ప్రజల కోసం సాధించిన ఆ విజయం ఏమిటో తెలియాలంటే, మరికొన్ని నెలలు ఓపిక పట్టాల్సిందే. అక్టోబర్ 13న ఆర్ ఆర్ ఆర్ విడుదల తేదీ ప్రకటించారు. రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ శరవేగంగా పూర్తి చేస్తున్నారు.
దాదాపు షూటింగ్ చివరి దశకు చేరినట్లు సమాచారం. ఆ మధ్య కీలకమైన పతాక సన్నివేశాలు తెరకెక్కించినట్లు చిత్ర యూనిట్ తెలియజేశారు. షూటింగ్ పార్ట్ పూర్తి కాగానే, విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ ప్రారంభించనున్నారు.
ఇక ఆర్ ఆర్ ఆర్ మూవీ అలియా భట్ హీరోయిన్ గా నటిస్తుంది. రామరాజు చరణ్ ని జంటగా ఆమె కనిపించనున్నారు. ఇక ఎన్టీఆర్ జోడిగా బ్రిటీష్ భామ ఒలీవియా మోరిస్ ని తీసుకున్నారు. బాలీవుడ్ హీరో అజయ్ దేవ్ గణ్ కీలక రోల్ చేస్తున్న ఆర్ ఆర్ ఆర్ చిత్రాన్ని డి వి వి దానయ్య నిర్మిస్తున్న విషయం తెలిసిందే.
