తెలుగు బుల్లితెరపై రారాణిగా వెలుగొందిన ఉదయభాను పిల్లల్ని కనేందుకు కాస్త గ్యాప్ తీసుకున్న భాను పవన్, త్రివిక్రమ్ మూవీలో ఐటమ్ నంబర్ తో తిరిగి దుమ్ము దులపనున్న భాను

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను 2018 సంక్రాంతి కానుకగా రిలీజ్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇదే కాంబినేషన్ లో వచ్చిన జల్సా, అత్తారింటికి దారేది సినిమాలు ఘనవిజయం సాధించటంతో కొత్త సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

సినిమాకి సంభందించి ఎటువంటి విషయాలు బయటికి రాకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు సినిమా యూనిట్ వాళ్ళు..సినిమా చాలా స్లోగా షూటింగ్ జరుపుకుంటున్నా ప్రతీ ఫ్రేమ్ లో చాలా ఆచితూచి అడుగులు వేస్తున్నారట. పవన్ అభిమానులకి..త్రివిక్రమ్ సినిమాలో చూపించే ట్విస్ట్ లకి కొదవ ఉండదని తెలుస్తోంది.

ఇక అంచనాలకు తగ్గట్టుగా భారీ తారాగణంతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ కోసం సీనియర్ యాంకర్ ను తీసుకున్నారట. గతంలో త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన జులాయి సినిమాలో స్పెషల్ సాంగ్ లో కనిపించిన ఉదయభాను, పవన్ సినిమాలోనూ ఐటమ్ సాంగ్ లో మెరవనుందన్న టాక్ వినిపిస్తోంది.

ఈ మధ్యనే మళ్లీ యాంకరింగ్ స్టార్ట్ చేసిన భాను.. వస్తూనే.. ఓ డ్యాన్స్ ప్రోగ్రాంను హోస్ట్ చేసేయనుంది. తెలంగాణ బతుకమ్మ పాటలో కూడా మెయిన్ అట్రాక్షన్ గా ఉదయభానునే నిలిచింది. ఇలాంటి సమయంలో ఉదయభానుతో ఐటెం సాంగ్ చేయిస్తే.. అది కచ్చితంగా ఆడియన్స్ ను ఎట్రాక్ట్ చేసే పాయింట్ అవుతుందని త్రివిక్రమ్ అనుకున్నాడట. ఇప్పటికే హాట్ యాంకర్ అనసూయ స్పెషల్ సాంగ్స్ తో అలరిస్తుండటంతో ఉదయభాను రీ ఎంట్రీతో అనసూయకు గట్టిపోటి తప్పేలా లేదు.