బిగ్‌బాస్‌ 13వ సీజన్‌ విన్నర్‌ సిద్ధార్థ్‌ శుక్లాని చూసిన ఉదయ్‌ కిరణ్‌ హీరోయిన్‌ అనితా హసా నందాని ఆసక్తికర కామెంట్‌ చేసింది. ఆయన కండల్‌ చూసి ఇక నేను ఆగలేను. వెంటనే బిగ్‌బాస్‌ నెక్ట్స్ సీజన్‌లో పాల్గొంటా అని చెప్పింది. అయితే ఇంత వరకు బాగానే ఉంది కానీ, తాను ఇటీవలే జన్మించిన తన బాబుతో కలిసి బిగ్‌బాస్‌ షోలో పాల్గొంటా అని చెప్పడం ఆసక్తిని రేకెత్తిస్తుంది. మరి అనితా ఎందుకు అలా చెప్పాల్సి వచ్చిందనేది చూస్తే.. 

బిగ్‌బాస్‌తో ఇటీవల పెద్దగా తెలియని వాళ్లు కూడా పాపులర్‌ అవుతున్నారు. కొందరైతే స్టార్‌ ఇమేజ్‌ని సొంతం చేసుకుంటున్నారు. వారికి వచ్చే క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హిందీలో ప్రసారమైన బిగ్‌బాస్‌ 13 సీజన్‌లో సిద్ధార్థ్‌ శుక్లా విజేతగా నిలిచాడు. ఆయన ఇటీవల నటి అనిత హసా నందాని భర్త రోహిత్‌రెడ్డిని కలిశారు. సిద్ధార్థ్‌ కండలు చూసి షాక్‌ అయిన రోహిత్‌ ఆయన కండలకు సంబంధించిన వీడియోని తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. దీంతో నెటిజన్లు సిద్ధార్థ్‌ ఫిజిక్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. 

ఇది చూసిన అనిత కూడా సరదాగా ఓ ఫన్నీ కామెంట్‌ పెట్టింది. `చాలా కామెంట్లు వస్తూనే ఉన్నాయి. నా కొడుకు అరవ్‌ని తీసుకుని నేను కూడా తర్వాతి సీజన్‌లో పాల్గొంటా. బై రోహిత్‌` అంటూ పోస్ట్ చేసింది. దీంతో దీనిపై కూడా నెటిజన్లు, ఆమె అభిమానులు సరదాగా కామెంట్లు చేస్తూ డిస్కషన్‌ని ఇంట్రెస్టింగ్‌గా మార్చారు. ఇదిలా ఉంటే అనిత తెలుగులో ఉదయ్‌ కిరణ్‌ నటించిన `నువ్వు నేను` చిత్రంతో పరిచయం అయ్యింది. తొలి చిత్రంతోనే హిట్‌ని అందుకుంది. 

ఆ తర్వాత `శ్రీరామ్‌`, `తొట్టిగ్యాంగ్‌`, `నిన్నే ఇష్టపడ్డాను`, `ఇది సంగతి`, `అహా నా పెళ్లంట`, `జీనియస్‌`, `మనలో ఒకడు` చిత్రాల్లో నటించింది. దీంతోపాటు హిందీ, తమిళం, కన్నడలోనూ పలు సినిమాల్లో నటించింది. పెళ్లి తర్వాత క్రమంగా సినిమాలు తగ్గించి టీవీ షోస్‌ చేస్తున్నారు. బిగ్‌బాస్‌లోనూ గెస్ట్ గా పాల్గొంది. మరోవైపు `నాగిని` టీవీ సిరీస్‌తో మెరిసింది మంచి గుర్తింపు తెచ్చుకుంది. అనితకి రోహిత్‌ రెడ్డితో 2013లో వివాహం జరిగింది. వీరికి మొదటి కుమారుడు ఆరావ్‌ రెడ్డి ఈ ఏడాది ఫిబ్రవరిలో జన్మించిన విషయం తెలిసిందే.