ఆస్కార్ 2024 అవార్డుల వేడుకకి కసరత్తు మొదలయింది. 2023 ఆస్కార్ అవార్డులు ఇండియాకి తీపి గుర్తుగా మారాయి. ఇక 2024 ఆస్కార్ అవార్డుల్లో ఇదే జోరు ఇండియన్ చిత్రాలు ప్రదర్శిస్తాయా అనే ఆసక్తి అందరిలో నెలకొంది.

ఆస్కార్ 2024 అవార్డుల వేడుకకి కసరత్తు మొదలయింది. 2023 ఆస్కార్ అవార్డులు ఇండియాకి తీపి గుర్తుగా మారాయి. ఆర్ఆర్ఆర్ చిత్రం సంచలనం సృష్టిస్తూ నాటు నాటు సాంగ్ కి అవార్డు సొంతం చేసుకుంది. అలాగే ది ఎలిఫెంట్ విష్పరర్స్ డాక్యుమెంటరీ మూవీ కూడా ఆస్కార్ గెలిచిన సంగతి తెలిసిందే. 

ఇక 2024 ఆస్కార్ అవార్డుల్లో ఇదే జోరు ఇండియన్ చిత్రాలు ప్రదర్శిస్తాయా అనే ఆసక్తి అందరిలో నెలకొంది. ఇండియా నుంచి అధికారికంగా ఆస్కార్ పోటీలోకి ఎంట్రీ ఇచ్చే చిత్రాలు ఏవి.. ఆపైన ఫైనల్ నామినేషన్స్ లో అర్హత సాధించే చిత్రాలు ఏవి అంటూ లెక్కలు మొదలయ్యాయి. 

ప్రముఖ కన్నడ దర్శకుడు గిరీష్ కాసరవెల్లి అధ్యక్షతన మొత్తం 17 మంది సభ్యులతో ఇండియా నుంచి ఆస్కార్ కి ఎంపిక చేసే చిత్రాల జాబితా తయారు చేసేందుకు చెన్నైలో కసరత్తు మొదలయింది. అధికారిక సమాచారం లేదు కానీ టాలీవుడ్ నుంచి కేవలం రెండు చిత్రాలు మాత్రమే ఈ ఆస్కార్ ఎంట్రీకి పోటీ పడే చిత్రాల లిస్ట్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ఆ రెండు చిత్రాలు మరేవో కాదు.. బ్లాక్ బస్టర్స్ గా నిలిచిన నాని దసరా, దిల్ రాజు నిర్మించిన బలగం చిత్రాలు అని తెలుస్తోంది. 

దసరా చిత్రంలో మద్యపానం, కులవివక్ష, పెత్తందారీతనం లాంటి అంశాలని దర్శకుడు అద్భుతంగా ఆవిష్కరించాడు. అలాగే బలగం చిత్రం తెలంగాణ సంప్రదాయాలని ప్రతిభింబిస్తూ కుటుంబ బంధాలని రసరమ్యంగా ఆవిష్కరించింది. ఇండియన్ నుంచి ఆస్కార్ బరిలో నిలిచే చిత్రాల జాబితాలో చోటు దక్కించుకునేందుకు టాలీవుడ్ నుంచి ఈ రెండు చిత్రాలు మాత్రమే పోటీలో ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో దిల్ రాజు కూడా బలగం చిత్రాన్ని ఆస్కార్స్ కి పంపే ప్రయత్నం చేస్తాం అని అన్నారు. మరి ఏంజరుగుతుందో చూడాలి.