Asianet News TeluguAsianet News Telugu

సైరా డబుల్ డోస్.. భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్స్

ఉయ్యాల వాడ నరసింహా రెడ్డి జన్మస్దలం అయ్యిన కర్నూల్ లో ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ మొదట జరిపి, ఆ తర్వాత హైదరాబాద్ లో చేయనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు సమాచారం. హైదరాబాద్ ఈవెంట్ ని రిలీజ్ సమయం దగ్గరపడ్డాక చేస్తారు. ఈ లోగా కర్నూల్ లో ఈవెంట్ ని పూర్తి చేస్తారు.

Two Pre-Release Events for Chiranjeevi starrer Syeraa
Author
Hyderabad, First Published Sep 7, 2019, 12:44 PM IST

భారీ సినిమాలకు ఆ బడ్జెట్ కు తగ్గట్లే ప్రమోషన్ కావాలి. లేకపోతే జనాల్లోకి అనుకున్నట్లుగా వెళ్లదు .బజ్ క్రియేట్ కాదు. దాంతో ఓపినింగ్స్ రావటం కష్టమైపోతుంది. ఈ విషయం ఎంతో అనుభవం ఉన్న చిరంజీవికు తెలుసు. అందుకే ఆయన తన తాజా చిత్రం సైరా విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అక్టోబర్ 2న గాంధీ జయింతి సందర్బంగా రిలీజ్ అవుతున్న ఈ చిత్రానికి ప్రీ రిలీజ్ ఈవెంట్ తో పూర్తి హైప్ తీసుకురావాలనుకుంటున్నారు. అందుకోసం ఈ చిత్రానికి రెండు చోట్ల ప్రీ రిలీజ్ ఈవెంట్స్ చేద్దామని నిర్ణయానికి వచ్చినట్లు సమచారం.

ఉయ్యాల వాడ నరసింహా రెడ్డి జన్మస్దలం అయ్యిన కర్నూల్ లో ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ మొదట జరిపి, ఆ తర్వాత హైదరాబాద్ లో చేయనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు సమాచారం. హైదరాబాద్ ఈవెంట్ ని రిలీజ్ సమయం దగ్గరపడ్డాక చేస్తారు. ఈ లోగా కర్నూల్ లో ఈవెంట్ ని పూర్తి చేస్తారు.

స్టార్ డైరక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న చిత్రం “సైరా నరసింహా రెడ్డి”.బ్రిటీష్ వారిని ఎదిరించిన తొలి స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితగాథను ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తోన్నారు.  కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రామ్‌చరణ్   నిర్మిస్తున్న ఈ చిత్రం 200 కోట్ల బడ్జెట్ తో రూపొందింది అని తెలుస్తోంది.

ఇక హిందీ రిలీజ్  విషయానికి వస్తే..“సైరా”కు బాలీవుడ్ స్టార్ హీరో హ‌ృతిక్ రోషన్ నుంచి భారీ పోటీ ఎదురవుతోంది. అక్టోబర్ రెండో తేదీనే హృతిక్, టైగర్ ష్రాఫ్ కలిసి నటించిన “వార్” సినిమా హిందీతోపాటు ఇతర భాషల్లో కూడా విడుదలవుతోంది. దీంతో రెండు భారీ సినిమాల మధ్య గట్టి పోటీ నెలకొంది.  

ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, నయనతార, విజయ్ సేతుపతి, కిచ్చా సుదీప్, జగపతిబాబు, రవికిషన్, తమన్నా, నిహారిక తదితరులు కీలక పాత్రల్లో నటించారు. అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి రత్నవేలు సినిమాటోగ్రఫీ అందించారు.   మరో ప్రక్క తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో భారీగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.  ఇప్పటికే  ఈ సినిమా టీజర్‌ను చిరంజీవి పుట్టినరోజు (ఆగస్ట్ 22) సందర్భంగా  విడుదల చేశారు. ఈ టీజర్ కు ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్  వచ్చింది.

Follow Us:
Download App:
  • android
  • ios