Asianet News TeluguAsianet News Telugu

#Oscar2023: ఆస్కార్‌ నామినేషన్లలో ఇండియన్‌ సినిమా సత్తా.. `ఆర్‌ఆర్‌ఆర్‌`తోపాటు మరో రెండు నామినేటెడ్‌

ఈ సారి ఆస్కార్‌ నామినేషన్లలో ఇండియన్ సినిమా చరిత్ర సృష్టించింది. మూడు సినిమాలకు ఆస్కార్‌ నామినేషన్లు దక్కాయి. `ఆర్‌ఆర్‌ఆర్‌`తోపాటు మరో రెండు డాక్యుమెంటరీ ఫిల్మ్స్ నామినేట్‌ అయ్యాయి. 

two more oscar nominations got to indian movies along with rrr naatu naatu song
Author
First Published Jan 24, 2023, 8:54 PM IST

ఆస్కార్ అవార్డులకు సంబంధించిన ఇండియన్‌ సినిమా ఈ సారి చరిత్ర రికార్డు సృష్టించింది. మూడు సినిమాలు ఆస్కార్‌ నామినేషన్లని సాధించాయి. ఒరిజినల్‌ సాంగ్‌ విభాగంలో `నాటు నాటు` పాటకిగానూ `ఆర్‌ఆర్‌ఆర్‌` ఆస్కార్‌కి నామినేట్‌ అయ్యింది. ఒరిజినల్‌ సాంగ్‌ విభాగంలో ఇండియన్‌ సినిమాకి ఆస్కార్‌ నామినేషన్‌ దక్కడం మొదటిసారి. అంతేకాదు మరో రెండు సినిమాలు కూడా ఆస్కార్‌కి నామినేట్‌ కావడం విశేషం. 

బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ విభాగంలో `ది ఎలిఫెంట్‌ విస్పరర్స్`, అలాగే డాక్యుమెంటరీ ఫీచర్‌ ఫిల్మ్ విభాగంలో `ఆల్‌ దట్‌ బ్రీత్స్` చిత్రాలు ఆస్కార్‌ నామినేషన్లని సాధించాయి. ఇలా ఈ మూడు సినిమాలు చరిత్ర సృష్టించాయని చెప్పొచ్చు. కార్తికి గోంజేల్స్ దీనికి దర్శకత్వం వహించగా, అచిన్‌ చైన్‌తో కలిసి గునీత్‌ మోంగా `ది ఎలిఫెంట్‌ విస్పరర్స్` డాక్యుమెంటరీని నిర్మించారు. మరోవైపు `ఆల్‌ దట్ బ్రీత్స్` డాక్యుమెంటరీ ఫిల్మ్ ని షానక్‌ సేన్‌ దర్శకత్వం వహించారు. ఇద్దరు అన్నదమ్ముల కథని తెలియజేసే చిత్రమిది. 

మరి ఈ మూడు సినిమాల్లో ఏది ఆస్కార్‌ని దక్కించుకుంటుంది? ఏది చరిత్ర సృష్టిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. మార్చి 12న ఈ విషయం తేలనుంది. 95వ ఆస్కార్‌ అవార్డులను మార్చి 12న ప్రకటిస్తారు. ఎన్నడూ లేని విధంగా ఈసారి మూడు సినిమాలు ఆస్కార్‌కి నామినేట్‌ కావడం విశేషంగా చెప్పొచ్చు. ఇది ఇండియన్‌ సినిమా గ్రోత్‌ని, పరిణామాన్ని తెలియజేస్తుంది. వీటితోపాటు `కాంతార`, `ది కాశ్మీర్‌ ఫైల్స్`, `చెల్లో షో` చిత్రాలు కూడా ఆస్కార్‌ కి షార్ట్ లిస్ట్ అయిన విషయం తెలిసిందే. కానీ అవి నామినేషన్లని దక్కించుకోలేదు. 

`ఆర్‌ఆర్‌ఆర్‌` సైతం `ఉత్తమ దర్శకత్వం`, `ఉత్తమ నటుడు` విభాగాల్లోనూ ఆస్కార్‌ నామినేషన్‌ కోసం పోటీ పడగా నామినేషన్స్ దక్కలేదు. ఇదిలా ఉంటే ఈ చిత్రాన్ని ఇండియన్‌ ఆస్కార్‌ కమిటీ బెస్ట్ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్ విభాగంలో ఎంపిక చేసి ఉంటే, `ఆర్‌ఆర్‌ఆర్‌`కి ఆస్కార్‌ నామినేషన్స్ దక్కేదనే టాక్‌ వినిపించింది. కానీ జ్యూరీ వైఫల్యంగా సినీ క్రిటిక్స్ కామెంట్లు చేస్తున్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios