ఇటీవల `పఠాన్‌`తో బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ అందుకున్న షారూఖ్‌ ఖాన్‌ ఇంట్లో దొంగలు పడ్డారు. ఇద్దరు యువకులు ఇంట్లోకి చొరబడ్డారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

బాలీవుడ్‌ బాద్‌ షా షారూఖ్‌ ఖాన్‌ ఇటీవల `పఠాన్‌`తో బంపర్‌ హిట్‌ అందుకున్నారు. బాలీవుడ్‌లోనే అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా ఇది నిలవడం విశేషం. ఇదిలా ఉంటే తాజాగా షారూఖ్‌ ఖాన్‌ మన్నత్‌ ఇంట్లో దొంగలు పడ్డారు. ఇద్దరు కుర్రాళ్లు గురువారం సాయంత్రం అక్రమంగా షారూఖ్‌ ఇంట్లోకి చొరబడ్డారు. వీరిని గుర్తించిన భద్రతా సిబ్బంది వెంటనే స్పందించి వారిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. 

పోలీసులు ఈ ఇద్దరు కుర్రాళ్లపై కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. ఈ విచారణలో ఈ ఇద్దరు యువకులు గుజరాత్‌కి చెందిన వారిగా గుర్తించారు. తాము షారూఖ్‌ ని కలిసేందుకు వచ్చినట్టు చెప్పారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఆ యువకులు ఇంట్లోకి చొరబడిన సమయంలో షారూఖ్‌ దంపతులు ఉన్నారా? లేరా అనేది తెలియాల్సి ఉంది. 

ఇక షారూఖ్‌.. బంద్రాలోని మన్నత్‌ హౌజ్‌ 27000 స్వైర్‌ ఫీట్‌ విస్తీర్ణంలో ఈ లగ్జరీ హౌజ్‌ ఉంది. దీని విలువ సుమారు 200కోట్లు ఉంటుందని సమాచారం. ఇక షారూఖ్‌ ఖాన్‌ దాదాపు ఏడేనిమిదేళ్ల తర్వాత `పఠాన్‌`తో అదిరిపోయే హిట్‌ని అందుకున్నారు. సిద్ధార్థ్‌ ఆనంద్‌ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్‌ మూవీలో దీపికా పదుకొనె హీరోయిన్‌గా నటించగా, జాన్‌ అబ్రహం విలన్‌ పాత్ర పోషించారు. 

ఈ చిత్రం రిపబ్లిక్‌ డే సందర్భంగా విడుదలై సంచలన విజయం సాధించింది. ఏకంగా ప్రపంచ వ్యాప్తంగా వెయ్యి కోట్లు సాధించింది. దీంతో `బాహుబలి`, `దంగల్‌`, `ఆర్‌ఆర్‌ఆర్‌`, `కేజీఎఫ్‌2` తర్వాత అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా నిలిచింది `పఠాన్‌`. ప్రస్తుతం షారూఖ్‌ .. `జవాన్‌` చిత్రంలో నటిస్తున్నారు. తమిళ దర్శకుడు అట్లీ దర్శకత్వం వహిస్తున్నారు. నయనతార కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇది ఈ జూన్‌లో విడుదల కాబోతుంది.