కన్నడ టాప్ హీరోయిన్స్‌లో ఒకరైన రాగిణి ద్వివేది  ఆ మధ్యన నాని సరసన ‘జండాపై కపిరాజు‘ చిత్రంలో కూడా  నటించి రాగిని...తెలుగు ప్రేక్షకులను కూడా మెప్పించారు. ఆమె సినిమాలతో పాటు పర్శనల్ విషయాలు ఎప్పుడూ మీడియాలో నానుతూంటాయి. ముఖ్యంగా బోయ్ ఫ్రెండ్స్ విషయంలో ఆమె గురించి కథలు..కథలుగా చెప్తూంటారు. తాజాగా ఈ విషయాన్ని ఖరారు చేస్తున్నట్లుగా ఆమె బోయ్ ప్రెండ్స్ ఇద్దరు ఓ హోటల్ లో కొట్టుకుని, బీర్ బాటిల్ తో తల పగల కొట్టుకునేదాకా వెళ్లారు.  ఈ ఘటన బెంగళూరులో జరుగగా, సీసీ కెమెరాలు పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి శివప్రకాశ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. 

వివరాల్లోకి వెళితే..  రాగిణి, తన ప్రస్తుత బోయ్ ప్రెండ్ , ఆర్టీఓ అధికారిగా ఉన్న రవి అనే వ్యక్తితో కలిసి బెంగుళూరు బనశంకరి ప్రాంతంలోని  రిట్స్ కార్టన్  హోటల్ కు వెళ్లింది. అయితే దురదృష్టవశాత్తు అప్పటికే అక్కడ ఆమె మాజీ బోయ్ ఫ్రెండ్, బిజినెస్ మేన్ శివ ప్రకాశ్ తన ఫ్రెండ్స్ తో కలిసి పార్టీ చేసుకుంటున్నారు. 

రాగిణి, రవి రావడంతోనే కోపం తెచ్చుకున్న శివ ప్రకాశ్ ..నన్ను  వదిలేసి, వేరే వారితో తిరుగుతున్నావా? అంటూ గొడవకి దిగాడు. ఈ గొడవ పెరగటంతో, పక్కనే ఉన్న బీర్ బాటిల్ తీసుకుని రవిపై దాడి చేశాడు. హోటల్ సిబ్బంది వీరిని విడిపించి అక్కడి నుంచి పంపగా, రాగిణి, రవిలు అశోక్ నగర పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో శివ ప్రకాశ్ ను అదుపులోకి తీసుకున్నామని, కేసును విచారిస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు. 

అయితే ఈ గొడవలో మరో ట్విస్ట్ బయిటపడింది.  హోటల్ కు రాగిణి, రవి వెళుతున్న టైమ్ లో .., రవి భార్య ఆయనకు ఫోన్ చేసి గొడవ పడ్డట్టు తెలుస్తోంది. రాగిణి కోసం తన జీవితాన్ని నాశనం చేశావని వాపోతూ, ఇప్పుడు ఆమెతో కలిసి ఎక్కడున్నావో, ఎక్కడికి పోతున్నావో తెలుసునని, ఎవరో ఒకరు వచ్చి నిన్ను చావగొడతారని అన్నట్టు సమాచారం. ఈ ఫోన్ కాల్ సంభాషణ జరిగిన కాసేపటికే రవిపై దాడి జరగడం తో రకరకాల అనుమానాలు కలుగుతున్నాయి. ఆమే కావాలని ఫోన్ చేసి గొడవ చేయించినట్లుగా పోలీస్ లు అనుమానిస్తున్నారు.