Asianet News TeluguAsianet News Telugu

''లవ్ స్టొరీ'' కి రెండు క్లైమాక్స్ లు ?

అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి హీరోహీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం ‘లవ్ స్టోరీ’. ఈ రొమాంటిక్ డ్రామాకు శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నారు. నాగచైతన్య, సాయి పల్లవి కలిసి తొలిసారి నటిస్తుండటం.. దీనికి శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి.

Two Climaxes For Naga Chaitanya Love Story?
Author
Hyderabad, First Published Sep 22, 2021, 4:31 PM IST

ఏ సినిమాకైనా క్లైమాక్స్ కీలకం. దాన్ని బట్టే సినిమా సక్సెస్ ఏ స్దాయి అనేది ఆధారపడి ఉంటుంది. అయితే ఒక్కోసారి కథ ఓ రకమైన క్లైమాక్స్ ని డిమాండ్ చేస్తే, ప్రేక్షకులను సంతృప్తిపరచటానికి మరో విధమైన క్లైమాక్స్ తో ఉంటుంది. ఒక్కోసారి తమ సినిమాకు విషాదాంతం బెస్టా, లేక హ్యాపీ ఎండింగ్ బెస్టా అనేది డిసైడ్ చేసుకోలేరు. అలాంటప్పుడు ఎందుకైనా మంచిదని రెండు క్లైమాక్స్ లు షూట్ చేసి దగ్గర పెట్టుకుని, పరిస్దితిని బట్టి వదులుతూంటారు. తాజాగా శేఖర్ కమ్ముల చిత్రం లవ్ స్టోరి కు కూడా అలాంటి ప్రయోగం చేయబోతున్నారని మీడియాలో ప్రచారం జరుగుతోంది.

అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమా కథ విషాదాంతమని తెలిసింది. స్యాడ్ క్లైమాక్స్ ఉంటుందట. బాధాకరమైన క్లైమాక్స్ సీక్వెన్స్‌ను శేఖర్ కమ్ముల ఈ సినిమాలో రాసుకున్నారని సమాచారం. నాగచైతన్య పోషించిన హీరో పాత్ర చనిపోగా.. అతని జ్ఞాపకాలతో సాయి పల్లవి పోషించిన పాత్ర జీవితాన్ని కొనసాగిస్తుందట. ప్రేక్షకులతో కంటతడి పెట్టించే ఎన్నో భావోద్వేగ సన్నివేశాలు ఈ సినిమాలో ఉన్నాయని అంటున్నారు. అయితే నిర్మాతల సూచన మేరకు అలాంటిదేమీ లేకుండా నాగచైతన్య, హీరోయిన్ కలిసే హ్యాపీ ఎండింగ్ ను కూడా ప్లాన్ చేసారట. రెండింటిని షూట్ చేసి,సెన్సార్ చేయించి రెడీగా పెట్టుకున్నారని చెప్తున్నారు. కులం ప్రధానంగా ఈ సినిమా కథ తిరుగుతుందని చెప్తున్నారు.

 ఈ సినిమాలో నాగచైతన్య, సాయి పల్లవి వేర్వేరు కులాలుకు చెందిన అబ్బాయి, అమ్మాయిగా కనిపించనున్నారు.సాయి పల్లవి..ఓ సాప్ట్ వేర్ ఇంజినీరుగా, నాగచైతన్య ..ఓ చిన్న డాన్స్ స్కూల్ నడుపుతూంటాడు. పల్లెటూరు నుంచి సిటీకి వచ్చిన వీరిద్దరి మధ్య ప్రేమ చిగురిస్తుంది. అయితే కులం అడ్డుగా నిలుస్తుందని చెప్తున్నారు. అంతేకాదు, ఈ సినిమాలో నాగచైతన్య తెలంగాణ యాసలో మాట్లాడతారు.

 అక్కినేని నాగచైతన్య - సాయి పల్లవి జంటగా నటించిన ''లవ్ స్టొరీ'' చిత్రానికి శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించారు. కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమాని సెప్టెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. సెకండ్ వేవ్  తర్వాత థియేట్రికల్ రిలీజ్ అవుతున్న క్రేజీ మూవీ ఇదే కావటంతో సినీ అభిమానులతో పాటుగా చిత్ర పరిశ్రమ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈ సినిమాతో మళ్లీ థియేటర్లు పుంజుకుంటాయని, తెలుగు చిత్ర పరిశ్రమ బాక్సాఫీస్ కు ఊపిరి పోస్తుందని అందరూ ఆశాభావంతో ఉన్నారు.

అంతేకాదు 'లవ్ స్టోరీ' సినిమా సక్సెస్ ని బట్టి రాబోయే రోజుల్లో పెద్ద సినిమాల విడుదలలు ప్లానింగ్ ఉండబోతోంది. అందుకే ఈ ఫీల్ గుడ్ ప్రేమకథా చిత్రం విజయం మొత్తం సినిమా పరిశ్రమకు చాలా కీలకం. నాగచైతన్య చిత్రానికి హిట్ టాక్ వచ్చి వీకెండ్ తర్వాత అంటే నాలుగో రోజు కలెక్షన్లు డ్రాప్ అవ్వకపోతే మాత్రం ఇది రికార్డ్ స్థాయి వసూళ్ళు రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ లో లెక్కలు వేస్తున్నారు. ఇదే కనుక జరిగితే 30 కోట్లు పైనే ఖర్చు పెట్టి చేసిన సినిమాలన్నీ వరుసగా థియేటర్లకు క్యూలు కట్టేస్తాయి.  
 

Follow Us:
Download App:
  • android
  • ios