స్టార్ హీరో హృతిక్ రోషన్ ప్రస్తుతం సూపర్ 30 చిత్రంతో పాటు, సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో మరో చిత్రంలో నటిస్తున్నాడు. ముంబై లో ఈ చిత్ర షూటింగ్ జరుగుతున్న సమయంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. సినిమా సెట్ కు పక్కనే ఉన్న ఓ  సూసైడ్ బాంబర్లు అరెస్ట్ అయ్యారు. కానీ వారు నిజమైన సూసైడ్ బాంబర్లు కాదు.. టెర్రరిస్టులు అంతకన్నా కాదు. ఏం జరిగిందో వివరాల్లోకి వెళదాం. 

ఈ చిత్రంలో టెర్రరిస్టులకు సంబంధించిన సన్నివేశాలు ఉన్నాయి. ఇద్దరు జూనియర్ ఆర్టిస్టులు టెర్రరిస్థులుగా నటిస్తున్నారు. వారిద్దరూ సూసైడ్ బాంబర్లుగా ఓ సన్నివేశంలో కనిపించాలి. అందుకు తగ్గట్లుగా ఒళ్ళంతా బాంబులతో కాస్ట్యూమ్స్ వేసుకున్నారు. షాట్ మధ్యలో బ్రేక్ రావడంతో వారిద్దరూ పక్కనే ఉన్న దుకాణం వద్దకు వెళ్లారు. సూసైడ్ బాంబర్లుగా అదే గెటప్ లో అక్కడకు వెల్ళడంతో దుకాణం వద్ద ఉన్న జనాలు భయబ్రాంతులకు గురయ్యారు. 

తాము టెర్రరిస్టులం కాదని చెప్పినా వినలేదు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారిద్దరిని అరెస్ట్ చేశారు. పోలీసులు కూడా జూనియర్ ఆర్టిస్టుల మాటలు నమ్మలేదు. చివరకు చిత్ర నిర్మాత స్వయంగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి వివరణ ఇచ్చారు. తమ చిత్రంలో వారిద్దరూ టెర్రరిస్టు పాత్రలు చేస్తున్నారని,  అందుకే ఆ కాస్ట్యూమ్స్ ధరించారని చెప్పడంతో పోలీసులు వారిద్దరిని విడిచిపెట్టారు.