కోలీవుడ్‌ విలక్షణ నటుడు విజయ్‌ సేతుపతి ఉన్నట్టు నెటిజన్ల ఆగ్రహానికి గురవుతున్నాడు. ఆయన అభిమానుల ట్రోలింగ్‌కి గురయ్యాడు. నెటిజన్లు, అభిమానులు, తమిళనాడు రాజకీయ నాయకులు ఇలా అనేక మంది విజయ్‌ సేతుపతిపై విరుచుపడుతున్నారు. అంతేకాదు `షేమ్‌ఆన్‌ విజయ్‌ సేతుపతి` యాష్‌ ట్యాగ్‌ని ట్విట్టర్‌లో ట్రోల్‌ చేస్తున్నారు.

ఆ వివరాల్లోకి వెళితే.. విజయ్‌ సేతుపతి శ్రీలంక బ్యాట్స్ మెన్‌ ముత్తయ్య మురళీధరన్‌ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న `800` బయోపిక్‌లో నటిస్తున్నారు. ముత్తయ్య మురళీధరన్‌ పాత్ర పోషిస్తున్నారు. ఎం.ఎస్‌. శ్రీపతి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా మోషన్‌ పోస్టర్‌ని మంగళవారం విడుదల చేశారు. దీనికి విశేష స్పందన లభించింది. 

ఇదే ఇప్పుడు వివాదానికి కారణమైంది. అయితే ఓ శ్రీలంకకు చెందిన వ్యక్తిపై తమిళంలో సినిమా తీయడం, అది కూడా విజయ్‌ సేతుపతి నటించడం వివాదంగా మారింది. ఎందుకంటే గతంలో శ్రీలంకలో తమిళియులపై అనేక దాడులు జరిగాయి. అక్కడ తమిళుల హక్కులు కాలరాయబడ్డాయి. ఊచకోత ఘటనలున్నాయి. ఇంతటి దారుణాలు తమిళులపై జరిగిన నేపథ్యంలోనూ అవన్నీ మరచి సినిమా ఎలా తీస్తారు, అందులో ఓ స్టార్‌ ఎలా నటిస్తారంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.