హీరోయిన్ కియారా అద్వానీ మరియు హీరో సిద్ధార్థ్ మల్హోత్రా   మధ్య ట్విట్టర్ లో ఆసక్తికర చర్చ సాగింది. కియారా అద్వానీ నటించిన లేటెస్ట్ మూవీ ఇందుకీ జవానీ ట్రైలర్ విడుదల నేపథ్యంలో రూమార్డ్ కపుల్, ట్విట్టర్ వేదికగా ఒకరిపై మరొకరు తమ అభిమానం చాటుకున్నారు. 'ఘజియాబాద్ కి చెందిన ఇందూ చాల ఫైర్ లో ఉంది. డిసెంబర్ 11న కలుద్దాం...' అనిసిద్ధార్థ్ మల్హోత్రా   ట్విట్టర్ పోస్ట్ పెట్టారు. 

సిద్ధార్థ్ మల్హోత్రా ట్వీట్ కి సమాధానంగా కియారా.. ఇందూ కూడా మిమ్మల్ని కలవడానికి చాలా ఆసక్తిగా ఉంది' అని ట్వీట్ చేసింది. కియారా, సిద్ధార్థ్ మల్హోత్రా ల మధ్య లవ్ ఎఫైర్ ఉందని ఎప్పటి నుండో ప్రచారం సాగుతుంది. అనేక మార్లు వీరిద్దరూ డిన్నర్ నైట్స్ కి వెళుతూ కెమెరా కంటికి చిక్కారు. ఐతే కియారా, సిద్ధార్థ్ మల్హోత్రా  తమ రిలేషన్ పై స్పందించిన దాఖలాలు లేవు. 

ప్రస్తుతం వీరిద్దరూ షేర్షా మూవీలో కలిసి నటిస్తున్నారు. సిద్ధార్థ్ మల్హోత్రా  ఈ మూవీలో డ్యూయల్ రోల్ చేస్తున్నారు. ఇక ఇందుకీ జవానీ మూవీ వచ్చే నెల 11న విడుదల కానుంది. దర్శకుడు అబీర్ సేన్ గుప్త తెరకెక్కించిన ఈ మూవీ రొమాంటిక్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కింది. ఇందుకీ జవానీ ట్రైలర్ సైతం విశేష ఆదరణ దక్కించుకుంటుంది.