Bigg Boss Telugu 7: హౌజ్‌లో ఉన్న టాప్-10 కంటెస్టెంట్లలో ఎవరి స్థానం ఎంత?
ప్రస్తుతం బిగ్ బాస్ హౌజ్‌లో పది మంది కంటెస్టెంట్లు ఉన్నారు. వీరిలో ఎవరి పొజిషన్ ఏంటనేది ఫైనల్ అయ్యింది. ఓ లీక్ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

బిగ్ బాస్ తెలుగు 7 షో పది వారాలు పూర్తి చేసుకుంది.ఈ ఆదివారం భోలే షావలి ఎలిమినేట్ అయ్యారు. దీంతో ప్రస్తుతం శివాజీ, పల్లవి ప్రశాంత్, యావర్, అమర్ దీప్, అర్జున్, శోభా శెట్టి, ప్రియాంక, అశ్విని, రతిక, గౌతమ్ ఉన్నారు. ఇంకా ఐదు వారాలుంది. పది మంది హౌజ్‌మెట్స్ ఉన్నారు. టాప్ 10 కంటెస్టెంట్లు హౌజ్‌లో ఉన్నారు. అయితే తాజాగా హౌజ్‌మెట్స్ ఓ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ఈ టాప్ 10 ఎవరి స్థానం ఏంటో నిర్ణయించుకునే టాస్క్ ఇచ్చాడు.
జనరల్‌గా ప్రతి సీజన్‌లోనూ ఇలాంటి టాస్క్ ఒకటి ఉంటుంది. తమ స్థానం కోసం పోటీపడటం, వారి నమ్మకాన్ని, వారు ఆడుతున్న ఆట తీరుని ప్రతిబింబిస్తుంది. ఈ నేపథ్యంలో తాజాగా బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ లో భాగంగా కంటెస్టెంట్లు తాము ఏ స్థానానికి సూట్ అవుతారో నిర్ణయించుకునే పని అప్పగించారు. అందులో తగ్గ పోరు, వాదనలు అనంతరం ఓ నిర్ణయానికి వచ్చారు. తమ స్థానాలను నిర్ణయించుకున్నారని తెలుస్తుంది.
Read more: Bigg Boss Telugu 7: రతిక మైండ్ ట్యూన్ చేసి గేమ్ మార్చేసిన శివాజీ... వలలో పడింది, బలి కానుందా?
ఇందులో నెంబర్ వన్ స్థానంలో శివాజీ ఉన్నారట. ఆతర్వాత రెండో స్థానంలో యావర్, మూడో స్థానంలో పల్లవి ప్రశాంత్, నాల్గో స్థానంలో ప్రియాంక, ఐదో స్థానంలో శోభా శెట్టి, ఆరో స్థానంలో అమర్ దీప్, ఏడో స్థానంలో గౌతమ్, ఎనిమిదో స్థానంలో అర్జున్, తొమ్మిదో స్థానంలో అశ్విని, పదో స్థానంలో రతిక నిలిచారు.
అయితే రతిక రెండు వారాల క్రితమే ఎలిమినేట్ అవుతుందని భావించారు. ఆమె సరిగా గేమ్ ఆడలేని పరిస్థితిలోనూ సేవ్ కావడం ఆశ్చర్యపరిచింది. అయితే వినోదం పంచే టేస్టీ తేజ ఎలిమినేట్ కావడం పెదవి విరిచేలా చేసింది. ఇప్పుడు భోలే ఎలిమినేషన్‌లోనూ అదే జరిగింది. అయితే రతికకి ఉన్న ఫాలోయింగ్ ఇప్పుడు పనిచేస్తుందని తెలుస్తుంది. ప్రస్తుతం పదకొండో వారంలో ఎనిమిది మంది నామినేట్ అయినట్టు సమాచారం.
Read more: Bhole Shavali: బిగ్ బాస్ 7 నుంచి పాట బిడ్డ భోలే షావలికి అందిన పారితోషికం ఎంతంటే? నిజంగా జాక్ పాటే