వయసు 75 దాటినా తన స్టైల్, స్టామినా తగ్గలేదని రజినీకాంత్ నిరూపిస్తున్నారు. ఆయన స్పీడ్ చూసి అభిమానులు మాత్రమే కాదు  ఇండస్ట్రీ కూడా ఆశ్చర్యపోతోంది. ఇంతకీ రజినీకాంత్ నుంచి రాబోయే సినిమాలు ఏంటి? 

బాక్సాఫీస్ సునామీకి సూపర్ స్టార్ రెడీ

ఇండియన్ సినిమాకి కింగ్ లాంటి వ్యక్తి, స్టైల్ కి మారుపేరైన 'సూపర్‌స్టార్' రజినీకాంత్. ఆయన పేరు ఒక బ్రాండ్ కాదు, అదొక ఎమోషన్! వయసు 75 దాటి ఉండొచ్చు, కానీ స్క్రీన్‌పై ఆయన ఎనర్జీ, నడకలో స్టైల్ చూస్తే ఇప్పటి కుర్ర హీరోలు కూడా షాక్ అవ్వాల్సిందే. ఇప్పుడు కోలీవుడ్ నుంచి వస్తున్న వార్త ఏంటంటే.. తలైవా బాక్సాఫీస్‌ను దుమ్ము దులపడానికి పక్కా ప్లాన్‌తో ఉన్నారు. కేవలం ఐదు నెలల గ్యాప్‌లో రెండు భారీ బడ్జెట్ సినిమాలతో అభిమానులకు డబుల్ ట్రీట్ ఇవ్వడానికి 'జైలర్' రెడీ అవుతున్నారు

75 ఏళ్ల వయసులో అదే జోరు.. 5 నెలల గ్యాప్‌లో 2 భారీ సినిమాలు

నెల్సన్ దిలీప్‌కుమార్, రజినీకాంత్ కాంబోలో వచ్చిన 'జైలర్' ఎలాంటి చరిత్ర సృష్టించిందో మనందరికీ తెలుసు. ఇప్పుడు దానికి సీక్వెల్‌గా 'జైలర్ 2' (తలైవర్ 172) షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. సన్ పిక్చర్స్ సంస్థ ఈ సినిమాపై భారీ బడ్జెట్ పెడుతోంది. సమాచారం ప్రకారం, షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకుంది, కేవలం 2-3 రోజుల పనే మిగిలి ఉంది. "ఆగస్టు నెలలో జైలర్ 2 రిలీజ్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నాం" అని స్వయంగా రజినీకాంత్ చెప్పడంతో అభిమానుల్లో ఉత్సాహం రెట్టింపైంది. 'జైలర్'తో నెల్సన్ డార్క్ హ్యూమర్, రజినీ మాస్ అవతార్ ఎలాంటి మ్యాజిక్ చేశాయో, ఇప్పుడు అంతకుమించి ఉండబోతోందని అంచనాలున్నాయి.

46 ఏళ్ల తర్వాత కమల్ -రజినీ మ్యాజిక్

'జైలర్ 2' సందడి ముగియకముందే, తలైవా తన 173వ సినిమాకు రెడీ అవుతున్నారు. ఈ సినిమాకు ఉన్న స్పెషాలిటీ ఏంటంటే.. 'ఉలగనాయగన్' కమల్ హాసన్ తన 'రాజ్ కమల్ ఫిల్మ్స్' బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. 'డాన్' ఫేమ్ సిబి చక్రవర్తి ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమా ప్రోమో షూటింగ్ ఏప్రిల్ 27 నుంచి చెన్నైలో ప్రారంభం కానుంది. కేవలం నాలుగు నెలల్లో షూటింగ్ పూర్తి చేసి, 2027 సంక్రాంతి పండక్కి సినిమాను రిలీజ్ చేయాలన్నది కమల్ హాసన్ ప్లాన్. అంటే ఆగస్టులో 'జైలర్ 2' వస్తే, జనవరిలో సిబి చక్రవర్తి సినిమా రానుంది.

RK x KH: చరిత్ర రిపీట్ కానుంది

సినీ అభిమానులకు అసలైన కిక్ ఇచ్చే విషయం ఏంటంటే.. రజినీకాంత్, కమల్ హాసన్ దాదాపు 46 ఏళ్ల తర్వాత ఒకే స్క్రీన్‌పై కనిపించబోతున్నారు! ఆగస్టు చివరిలో ఈ భారీ ప్రాజెక్ట్ షూటింగ్ మొదలుకానుంది. ఇది కేవలం సినిమా కాదు, భారతీయ సినిమా ఇద్దరు దిగ్గజాల కలయిక. దీనితో పాటు, ఉదయనిధి స్టాలిన్ కొడుకు ఇన్‌బనిధి స్టాలిన్ నిర్మించే సినిమాలో కూడా రజినీ కనిపించనున్నారు. మొత్తానికి తలైవా చేతిలో ప్రస్తుతం వరుస ఆఫర్లు ఉన్నాయి. వయసైనా స్టైల్, స్టామినా తగ్గలేదు' అని రజినీకాంత్ మరోసారి నిరూపిస్తున్నారు. రజినీ 'బుల్లెట్ స్పీడ్' వర్క్ చూసి మొత్తం ఇండస్ట్రీనే ఫిదా అయిపోయింది. 2025 ఆగస్టు నుంచి 2027 సంక్రాంతి వరకు థియేటర్లలో 'తలైవా' నామస్మరణ గ్యారెంటీ