MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • శోభన్ బాబు సలహా వల్ల 200 కోట్లకు పైగా ఆస్తులు సంపాదించిన స్టార్ నటుడు ఎవరో తెలుసా?

శోభన్ బాబు సలహా వల్ల 200 కోట్లకు పైగా ఆస్తులు సంపాదించిన స్టార్ నటుడు ఎవరో తెలుసా?

టాలీవుడ్ లో హ్యాండ్సమ్ హీరోగా శోభన్ బాబు రికార్డు ఎవరు బ్రేక్ చేయలేరు. ఆయన ఎంత అందగాడో.. అంత క్రమశిక్షణ కూడా కలిగి ఉండేవారు. శోభన్ బాబు ఆర్ధిక క్రమశిక్షణ ఫాలో అవుతూ.. 200 కోట్లకు పైగా ఆస్తులు సంపాదించుకున్న స్టార్ నటుడు ఎవరో తెలుసా?

3 Min read
Author : Mahesh Jujjuri
Published : Apr 09 2026, 01:44 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
టాలీవుడ్ రొమాంటిక్ హీరో..
Image Credit : Asianet News

టాలీవుడ్ రొమాంటిక్ హీరో..

ఒకప్పుడు టాలీవుడ్‌లో రొమాంటిక్ హీరో అంటే.. శోభన్ బాబు పేరు మాత్రమే వినిపించేది. ఆంధ్రా అందగాడు, సోగ్గాడు, అందాల నటుడు, నటభూషణ్... ఇలా శోభన్ బాబు ను ముద్దు పేర్లతో పిలిచే వారు అభిమానులు. కోట్లాది అభిమానుల మనసుల్లో చెరగని ముద్ర వేసిన శోభన్ బాబు... కెరీర్ బిగినింగ్ లో ఎన్నో ఆర్ధిక కష్టాలు అనుభవించారు. 

కనీసం ఇంట్లో ఫాన్ కూడా లేని రోజుల్లో తన కుటుంబంతో కలిసి సింగిల్ రూమ్ లో నివసించారు శోభన్ బాబు. అన్ని కష్టాలు అనుభవించారు కాబట్టే.. ఆయన డబ్బు విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉండేవారు. సినిమాల నుంచి వచ్చిన డబ్బుతో ఎక్కువగా స్థిరాస్తులు కొనుగోలు చేశారు శోభన్ బాబు. ఎక్కువగా స్థలాల మీద ఇన్వెస్ట్ చేసేవారు శోభన్ బాబు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
తోటి నటలకు శోభన్ బాబు ఆర్ధిక సలహాలు..
Image Credit : our own

తోటి నటలకు శోభన్ బాబు ఆర్ధిక సలహాలు..

తన కో ఆర్టిస్ట్ లు.. తన తరువాత వచ్చిన జూనియర్ ఆర్టిస్ట్ లకు కూడా శోభన్ బాబు ఇదే సలహా ఇచ్చేవారు. ఉన్న డబ్బును స్థలాల మీద ఇన్వెస్ట్ చేయండని చాలామంది నటీనటులకు ఆయన సలహా ఇచ్చారు. శోభన్ బాబు సలహా పాటించకపోవడం వల్ల కోట్ల ఆస్తులు పోగోట్టుకున్నామని జయసుధ లాంటి స్టార్స్ ఒప్పుకున్న సందర్భాలు ఉన్నాయి. ఇక ఆయన మాటలు విని వందల కోట్లు సంపాధించిన వారు కూడా ఉన్నారు. శోభన్ బాబు, రాజేంద్ర ప్రసాద్, శరత్ బాబు, ఇలా ఎంతో మంది స్టార్స్ శోభన్ బాబు మాట విని.. కోట్లకు పడగలెత్తారు. ఈక్రమంలో సోగ్గాడు మాటలు విని 200 కోట్లకు పైగా ఆస్తులు పోగేసిన నటుడు ఎవరో తెలుసా?

35
సోగ్గాడి సలహాతో 200 కోట్ల ఆస్తి సంపాదించిన శరత్ బాబు
Image Credit : our own

సోగ్గాడి సలహాతో 200 కోట్ల ఆస్తి సంపాదించిన శరత్ బాబు

..ఆ నటుడు ఎవరో కాదు శరత్ బాబు... అవును శరత్ బాబు హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వందల సినిమాల్లో నటించారు. సినిమాల ద్వారా వచ్చిన రెమ్యునరేషన్ తో ముఖ్యమైన నగరాల్లో శరత్ బాబు ప్రాపర్టీస్ కొనడం స్టార్ట్ చేశాడు. చెన్నైలో భారీ బంగ్లా, షాపింగ్ కాంప్లక్స్, బెంగళూర్ లో ఇల్లు, కాంప్లెక్స్, హైదరాబాద్ లో ఇల్లు, ఆముదాల వలసలో ఇల్లు.. కొన్ని భూములు కూడా కొన్నాడట శరత్ బాబు. మొత్తంగా ఆయన దాదాపు 200 కోట్ల ఆస్తులను సంపాదించినట్టు.. ఆకాలంనాటి జర్నలిస్ట్, అసిస్టెంట్ డైరెక్టర్ యూట్యూబ్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.

45
పిసినారి కామెంట్స్ పై శోభన్ బాబు క్లారిటీ
Image Credit : our own

పిసినారి కామెంట్స్ పై శోభన్ బాబు క్లారిటీ

ఇండస్ట్రీలో అందరు తనను పీనాసి అనడంపై శోభన్ బాబు ఓసందర్భంలో క్లారిటీ ఇచ్చారు. ఓ ఇంటర్వ్వూలో మాట్లాడుతూ.. '' అందరు నన్ను పిసినారి అంటున్నారు. మహానుభావుడు ఎన్టీఆర్ ఓ మాట అంటుండేవారు. 

నా అభిమానులందరికి తలా ఒక్క రూపాయి ఇచ్చుకుంటూ వెళ్తే.. ఆతరువాత ఆ రూపాయి నేను అందరిని అడుక్కోవలసి వస్తుంది.. అని అనేవారు. అందుకే నేను అపాత్రదానం చేయను. అర్ధం లేని చోట ఎక్కువ ఖర్చు పెట్టడం అనవసం. అవసరం ఉన్న చోట మాత్రమే నేను ఖర్చు చేస్తాను. అది నా కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకుని మాత్రమే కాదు. నన్ను నమ్ముకున్న 60 కుటుంబాలను దృష్టిలో పెట్టుకునినేను జాగ్రత్తగా ఉంటాను. 

ఆ 60 కుటుంబాలకు నేను ఎంత చేశాను, ఏం చేశాను, ఎంత మంది నావల్ల చదవుకుంటున్నారు, మంచి పోజిషన్ లో ఉన్నారు అనేది నేను ఎప్పుడు ఎక్కడా చెప్పలేదు. దానం చేసి చెప్పుకోవలసిన అవసరం కూడా లేదు. ఎవరు ఎన్ని అన్నా.. నేను ఏం చేశాను అన్నది నాకు తెలుసు'' అని శోభన్ బాబు అన్నారు.

55
శోభన్ బాబు 10000 కోట్ల ఆస్తులు..?
Image Credit : Twitter

శోభన్ బాబు 10000 కోట్ల ఆస్తులు..?

శోభన్ బాబు డబ్బును వృధా చేసేవారు కాదు. ఆయన సంపాధించిన సొమ్మ అంతా బిజినెస్ లో పెట్టారు. ప్రతీ పైసా ఆయన భూమిపై పెట్టారు. చెన్నైలో సగం భూములు ఆయనవే. దాదాపు 10 వేల కోట్ల విలువైన ఆస్తులను సంపాదించారట శోభన్ బాబు. ఆయన హీరోగా ఎంత స్టార్ డమ్ చూసినా.. తన ఫ్యామిలీని మాత్రం ఇండస్ట్రీలోకి రానివ్వలేదు అందాల నటుడు. 

తన దగ్గర పనిచేసేవారిని చాలా బాగా చూసుకునేవారు శోభన్ బాబు. పనివారి కుటుంబాలక కావల్సిన ఆర్ధిక అవసరాలు శోభన్ బాబు దగ్గరుండి చూసుకునేవారు. వారి పిల్లలను కూడా ఆయన చదివించేవారు. శోభన్ బాబు గుప్తదానాల గురించి మరో హీరో కృష్ణం రాజు ఓ సందర్భంలో గొప్పగా చెప్పారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
శోభన్ బాబు
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: కవరింగ్ స్టార్ రోహిత్ అంటూ నామినేట్ చేసిన త్రిగుణ్, షాలినికి ఇచ్చి పడేసిన రామ్ ప్రసాద్
Recommended image2
Allu Sneha: సోషల్ మీడియాలో దూసుకుపోతున్న అల్లు అర్జున్ భార్య.. ఫ్యామిలీని చూసుకుంటూనే బిజినెస్ లో సంపాదన
Recommended image3
Bhagyashri Borse: నాలుగు సినిమాలు ఫట్, ఐదో సినిమాతో షేక్ చేసిన భాగ్యశ్రీ.. చందమామలా వెలిగిపోతోందిగా
Related Stories
Recommended image1
Balakrishna : పొద్దు పొద్దున్నే 3 గంటలకు.. బాలయ్య బ్యాడ్ హ్యాబిట్, ఎందుకు మానలేకపోతున్నాడంటే?
Recommended image2
Meena : 10 కోట్ల ఇల్లును 100 కోట్లకు అమ్మేసిన హీరోయిన్, మీనా మాస్టర్ ప్లాన్ మామూలుగా లేదుగా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved