నారా వారింట పెళ్లి సందడి షురూ అయ్యింది. హీరోయిన్ శిరీషను ప్రేమించిన రోహిత్.. ఆమె మెడలో మూడు ముళ్లు వేయబోతున్నారు. తాజాగా హల్ధీతో పెళ్లి వేడుకలు మొదలయ్యాయి
నారా రోహిత్ పెళ్ళి వేడుకలు
టాలీవుడ్ యంగ్ హీరో నారా రోహిత్ త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెడుతున్నారు. హీరోయిన్ శిరీష మెడలో మూడు ముళ్లు వేయడానికి రెడీ అయ్యాడు నారా రోహిత్. ఈక్రమంలో నారా వారింట పెళ్లి వేడుకలు అంగరంగ వైభవంగా మొదలయ్యాయి. . గత ఏడాది అక్టోబర్‌లో ఉంగరాలు మార్చుకున్న ఈ జంట, ఇప్పుడు మూడు ముళ్ల బంధంతో ఒక్కటవ్వడానికి సిద్ధమవుతున్నారు. వీరి పెళ్ళి గత ఏడాది జరగాల్సి ఉండగా.. రోహిత్ తండ్రి మరణంతో అది వాయిదా పడింది.
హల్దీ వేడుకలతో ప్రారంభం
రీసెంట్ గా ఇటు రోహిత్ ఇంట్లో, అటు శిరీష ఇంట్లో పసుపు దంచే కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. కుటుంబసభ్యులు, బంధువులు, స్నేహితుల మధ్య జరిగిన ఈ కార్యక్రమంలో బంధుమీత్రులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఇక శనివారం నాడు కాబోయే దంపతుల హల్దీ వేడుకను హైదరాబాద్‌లోని ఓ ఫామ్ హౌస్‌లో ఘనంగా జరుపుకున్నారు. ఆటలు, పాటలు, సందడి మధ్య రోహిత్–శిరీషలు సాంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోయారు.
ఐదు రోజుల గ్రాండ్ వెడ్డింగ్ ప్లాన్
ఇప్పటి వరకూ జరిగిన ఈ వేడుకలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీటిని చూసిన అభిమానులు, నెటిజన్లు కాబోయే దంపతులకు అభినందనలు తెలుపుతూ.. కామెంట్లు పెడుతున్నారు. ఇక నారా రోహిత్, శిరీషల వివాహ వేడుకలు మొత్తం ఐదు రోజులపాటు జరగనున్నాయి. ఇప్పటికే హల్దీ వేడుక పూర్తి కాగా, ఆదివారం రోహిత్ పెళ్లి కొడుకుగా ముస్తాబు కానున్నారు. అక్టోబర్ 28న మెహందీ వేడుకలు జరగబోతున్నాయి. అక్టోబర్ 29న సంగీత్ నైట్, అక్టోబర్ 30న రాత్రి 10:35 గంటలకు పెళ్లి కార్యక్రమం జరగనుంది.
ఈ గ్రాండ్ వెడ్డింగ్‌కు ఇరు కుటుంబాలతో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరుకానున్నారని సమాచారం. ఈ పెళ్లి వేడుకలకు పెద్ద సంఖ్యలో వీఐపీలు రానున్న నేపథ్యంలో వారి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.
నారా రోహిత్ ప్రేమ -పెళ్లి
నారా రోహిత్ హీరోగా నటించిన ప్రతినిధి 2’ సినిమాలో హీరోయిన్‌గా నటించింది శిరీష (సిరి లేళ్ల). ఆ సినిమా షూటింగ్ సమయంలోనే వీరి మధ్య స్నేహం పెరిగి ప్రేమగా మారింది. పెద్దల అనుమతితో గత ఏడాది అక్టోబర్‌లో నిశ్చితార్థం చేసుకున్నారు. కుటుంబసభ్యుల సమక్షంలో ఉంగరాలు మార్చుకున్న వీరు.. ఇప్పుడు కొత్త జీవితంలోకి అడుగు పెట్టబోతున్నారు. ఈక్రమంలో నారా, నందమూరి ఫ్యాన్స్ సోషల్ మీడియాలో #NaraRohithWedding హ్యాష్‌ట్యాగ్ ను వైరల్ చేస్తూ.. స్పెషల్ గా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
