- Home
- Entertainment
- 100 మిర్చి బజ్జీలు ఒకేసారి లాగించే హీరో, నాటుకోడి తో 20 ఇడ్లీలు అవలీలగా తినే నటుడు ఎవరో తెలుసా?
100 మిర్చి బజ్జీలు ఒకేసారి లాగించే హీరో, నాటుకోడి తో 20 ఇడ్లీలు అవలీలగా తినే నటుడు ఎవరో తెలుసా?
ఇప్పుడంటే హీరోలు సిక్స్ ప్యాక్స్ అంటూ డైటింగ్ లు చేస్తూ.. తిండి విషయంలో జాగ్రత్తగా ఉంటున్నారు. కానీ ఆ కాలంలో మాత్రం కడుపునిండా తిని... గట్టిగా వర్కౌట్లు చేసేవారు. అలనాటి హీరోలలో ఒక్క దెబ్బకు 100 మిర్చిబజ్జీలు లాగించే హీరో ఎవరో మీకు తెలుసా?

డైటింగ్ చేస్తోన్న హీరోలు
ప్రస్తుతం హీరోలు సిక్స్ ప్యాక్ లు, 8 ప్యాక్ ల వెంట పరుగులు పెడుతున్నారు. తిండి విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నారు. అసలు అన్నం తినడం మానేసిన హీరోలు కూడా ఉన్నారు. ఫైబర్, ప్రోటీన్ ఫుడ్ అంటూ.. చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కానీ ఆ కాలంలో హీరోలు మాత్రం కడుపునిండా తినేవారు, అందుకు తగ్గట్టు శ్రమించేవారు. హీరోలుగా నటిస్తూ..వ్యవసాయ పనులు చేసిన వారు కూడా లేకపోలేదు. అప్పట్లో ఫుడ్ హ్యాబిడ్స్ ఎలా ఉండేవంటే.. ఓ హీరో సాయంత్రం స్నాక్స్ కోసం ఏకంగా 100 మిర్చిబజ్జీలు లాంగించేవాడట. ఆ హీరో మరెవరో కాదు నటసార్వభౌముడు నందమూరి తారక రామారావు.
రాజేంద్ర ప్రసాద్ చెప్పన రహస్యం
ఎన్టీఆర్ భోజన ప్రియుడు అని అందరికి తెలిసిందే.. అయితే ఆయన ఏం తింటాడు అనే విషయంలో.. ఎన్టీఆర్ తో ట్రావెల్ చేసిన కొంత పలు ఇంటర్వ్యూలలో కొన్నివిషయాలు వెల్లడించారు. అయితే ఎన్టీఆర్ భోజనం గురించి నటకిరీటి రాజేంద్ర ప్రసాద్.. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో కొన్ని విషయాలు షేర్ చేసుకున్నారు. ఎన్టీఆర్ స్నాక్స్ గా ఏం తినేవారనే విషయాన్ని ఆయన వివరించారు. మద్రాస్ లో ఉండే రోజుల్లో.. ఆంధ్రా నుంచి ప్రత్యేకంగా వంటవాడిని ప్రత్యేకంగా పెట్టుకున్నారట. ఆయన సాయంత్రం అయ్యే సరికి ఓ బుట్టలో వేడి వేడిగా మిరపకాయ బజ్జీలు వేసుకుని వచ్చేవాడట. ఆ బుట్టలో దాదాపు 100 నుంచి 125 బజ్జీలు ఉంటాయి. వాటిని అలానే ఒళ్లో టవల్ వేసుకుని బుట్ట పెట్టుకుని.. ఒక్క సారికి ఒక్క బజ్జీ నమిలి పడేసేవారట. అంతే కాదు ఆ బజ్జీ మనంతింటే కారం తలకెక్కి.. చెమటలు పడతాయి.. అటువంటిది... ఎన్టీఆర్ అంత కారంగా ఉండే బజ్జీలు కూడా అలవోకగా.. అలా తినేసేవారట.
.ఎన్టీఆర్ ఆహారపు అలవాట్లు
ఉదయం 4 గంటలకే నిద్ర లేచేవారట. ఆయన ఇంటి పెరడులో ఓ లారీ ఇసుక కుప్పగా ఉండేదట. ఆ కుప్పను ఇటు నుంచి అటు ఎత్తిపోసేవారట. అదే ఆయన జిమ్ము. ఇక ఎన్టీఆర్ 5.30 వరకూ కసరత్తులు చేసిన స్నానం పూజ అయిపోయి బ్రేక్ ఫాస్ట్ కు రెడీ అయ్యేవారట. ఒక్కోసారి 5 గంటలకే బ్రేక్ ఫాస్ట్ కు కూర్చునేవారు పెద్దాయన. అరచేతి మందంతో ఉన్న ఇరవై ఇడ్లీలను నేతిలో ముంచుకుని ఎన్టీఆర్ అవలీలగా తినేసేవారట. ఇడ్లీతో నాటుకోడిని తందూరీ చేయించుకుని నంజుకునేవారట.
యాపిల్ జూస్ అంటే ఇష్టం.
ఎన్టీఆర్ ఫుడ్ హ్యాబిట్స్ చాలా డిఫరెంట్ గా ఉండేవి. నాజ్ వెజ్ తినని రోజుల్లో .. తోటకూర వెల్లుల్లి కారం తో పాటు మరికొన్ని వెజ్ వెరైటీలు తినేవారట ఎన్టీఆర్. ఇక వెజ్ మీల్స్ అయితే గోంగూర, నెయ్యి, రెండు రకాల కూరలు, చారు, అప్పడం, పెరుగు, ఖచ్చితంగా ఉండాల్సిందే. ఇక ఇవి కాకుండా యాపిల్ జ్యూస్ అంటే ఎన్టీఆర్ కు ఎంతో ఇష్టం. మద్రాసులో ఉన్న టైమ్ లో యాపిల్స్ ఎక్కువగా ఎక్కడ బాగుంటాయో కనుక్కుని మరీ.. అక్కడి నుంచి తెప్పించుకునేవారట. షూటింగ్ టైమ్ లో కూడా ఎంత బిజీగా ఉన్నా..రోజుకు 3 నుంచి 5 బాటిల్స్ యాపిల్ జ్యూస్ తాగేవారట ఎన్టీఆర్. సమ్మర్ లో ఈ కోటా పెరిగేదట. ఇక సమ్మర్ వస్తే ఆయన ఫుడ్ లో కాస్త మార్పులు జరిగేవని తెలుస్తోంది. ఎండాకాలంలో రెండు లీటర్ల బాదం పాలు కూడా ఆయన తీసుకునే వారట పెద్దాయన.