కమల్ హాసన్ లో కోపం ఎప్పుడైన చూశారా? ఆయన అభిమానులను తిట్టడం, కోప్పడటం లాంటి సంఘటనలు ఎప్పుడైనా జరిగాయా? తాజాగా కమల్ తన అభిమానిపై అసహనం వ్యక్తం చేశారు. ఇంతకీ అంతలా ఆ అభిమాని ఏం తప్పు చేశాడు.

ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాల్లో వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే… చెన్నైలో మక్కల్‌ నీది మయ్యం పార్టీ సమావేశం ఇటీవల నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో కమల్‌ హాసన్‌ పాల్గొన్నారు. కార్యక్రమం మధ్యలో, ఒక కార్యకర్త వేదికపైకి వచ్చి పెద్ద కత్తిని ఆయనకు బహుమతిగా అందజేశారు. ప్రారంభంలో కమల్‌ నవ్వుతూ కత్తిని స్వీకరించారు.

అయితే, మరో కార్యకర్త బలవంతంగా ఆ కత్తిని కమల్‌ చేతికి మరింత స్పష్టంగా అందజేయాలని ప్రయత్నించగా, ఆయన అసహనం వ్యక్తం చేశారు. కమల్‌ హాసన్‌ ఓ కార్యకర్తను హెచ్చరిస్తూ, “కత్తిని కిందపెట్టు” అని ఆదేశించారు. ఈ సమయంలో అక్కడే ఉన్న పోలీస్‌ అధికారి వెంటనే తీసుకొని, కార్యకర్తను అడ్డుకున్నారు. కత్తిని పక్కన పెట్టించి, పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.

Scroll to load tweet…

ఈ ఘటన అనంతరం కొంతమంది కార్యకర్తలు కమల్‌తో సెల్ఫీలు దిగేందుకు, షేక్ హ్యాండ్ ఇవ్వాలని ఆరాటం చూపారు. భద్రతా సిబ్బంది వెంటనే స్పందించి వారిని వేదిక నుంచి తిప్పి పంపించారు.

ఈ ఘటనతో కార్యక్రమంలో కొంతసేపు ఉద్రిక్తత నెలకొన్నా, కమల్‌ హాసన్‌ వెంటనే కార్యక్రమాన్ని కొనసాగించారు. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతోంది. నెటిజన్లు కూడా రకరకాలుగా స్పందిస్తున్నారు. కార్యక్రమంలో భద్రతా లోపంపై కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయి.