Asianet News TeluguAsianet News Telugu

Guppedantha Manasu Serial Today:ప్రేమ జంట ఉచ్చులో వసుధార, వెనక శైలేంద్ర హస్తం...?

మీ కాలేజీలో చదివే చిత్ర అనే అమ్మాయి సూసైడ్ అంటెప్ట్ చేసిందని, ఆస్పత్రిలో ప్రాణాపాయ స్థితిలో ఉందని చెబుతారు. దీంతో, వీళ్లు వెంటనే బయలుదేరి ఆస్పత్రికి వెళతారు. ఇక, హాస్పిటిల్ లో చిత్ర తల్లిదండ్రులు ఏడుస్తూ ఉంటారు. డాక్టర్లు ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు.  ఈలోగా రిషి వాళ్లు అక్కడికి వచ్చేస్తారు.

Guppedantha Manasu Serial Today:24th November VasuDhara is accused ram
Author
First Published Nov 24, 2023, 8:04 AM IST

Guppedantha Manasu Serial Today: ఈరోజు ఎపిసోడ్ లో  ఫణీంద్ర ఇంట్లోకి కొత్తగా ఒక పని మనిషిని పెడతాడు. పని మనిషి అవసరం ఏముందని దేవయాణి అడుగుతుంది. దీంతో, ధరణి, శైలేంద్రలను తాను బయటకు పంపిస్తున్నానని, వారు సంతోషంగా ఉండటానికి  ఇలా చేశానని, ధరణి లేని సమయంలో ఇంట్లో పనులు నువ్వు చేయలేవు కదా అందుకే, పని అమ్మాయిని పెట్టానని ఫణీంద్ర చెబుతాడు. ఇంతకాలం ధరణి ఇంట్లోనే నాలుగు గోడల మధ్యలోనే ఖైదీలాగే ఉండిపోయిందని, ఆమెకు కూడా చిన్న చిన్న ఆశలు ఉంటాయని, అవి తీర్చే బాధ్యత భర్తపై ఉంటుందని చెబుతాడు. ఇప్పుడిప్పుడే శైలేంద్ర ధరణిని అర్థం చేసుకుంటున్నాడని, ఇలాంటి సమయంలో భార్యను బయటకు తీసుకువెళ్లి, కొంతకాలం గడిపితే వాళ్లిద్దరి మధ్య సాన్నిహిత్యం బాగా పెరుగుతుందని చెబుతాడు. కాగా, తండ్రి చెప్పినదానికి  శైలేంద్ర వెంటనే అంగీకరిస్తాడు. దేవయాణి ముఖం మాత్రం మాడిపోయి ఉంటుంది. బ్యాగులు సర్ది ఉంచమని శైలేంద్ర ధరనికి చెబుతాడు.

Guppedantha Manasu Serial Today:24th November VasuDhara is accused ram

మరోవైపు వసుధార ఒంటరిగా కూర్చొని చందమామను చూస్తూఉంటుంది. ఆ సమయంలో కాలేజీలో అమ్మాయి, అబ్బాయి గొడవ గుర్తుకువస్తుంది. దాని గురించి ఆలోచిస్తుండగా, రిషి అక్కడకు వస్తాడు. ఏం ఆలోచిస్తున్నావ్ అంటే, కాలేజీలో చిత్ర గురించి ఆలోచిస్తున్నాను అంటుంది. అయితే, దానిపై రిషి కూడా మాట్లాడతాడు. అసలు ఆ అబ్బాయి అలా ఎలా ప్రవర్తిస్తాడు? మనం ప్రేమించినవాళ్లు, మనల్ని ప్రేమించకపోయినా వారిని ఇబ్బంది పెట్టకూడదు అని అంటాడు. అప్పుడే వసుకి, గతంలో రిషి ప్రపోజ్ చేసిన విషయం గుర్తుకువస్తుంది. అప్పుడు తాను లవ్ ప్రపోజల్ రిజక్ట్ చేసినప్పుడు బాధపడ్డారా అని అడుగుతుంది. చాలా బాధపడ్డానని , తన బాధను  వివరిస్తాడు. అయితే, తర్వాత వసు కూడా ప్రపోజ్ చేసిందని, అది కళ, నిజమో కూడా తనకు తెలియదని, ఆ క్షణం తన జీవితంలో అందమైన రోజు అని చెబుతాడు. అయితే, ఆ రోజు ప్రపోజ్ చేసే సమయంలో తనకు చాలా భయం వేసిందని చెబుతుంది. ఎందుకు అని రిషి అంటే, మీరు ప్రపోజ్ చేసినప్పుడు నేను రిజక్ట్ చేశానని, నేను ప్రపోజ్ చేస్తే, మీరు కూడా రిజెక్ట్ చేస్తారని అనుకున్నానని అంటుంది. అయితే, ప్రేమలో పంతాలు ఉండవని, కేవలం ప్రేమ మాత్రమే ఉంటుందని రిషి అంటాడు.

ఇక, వాతావరణం కారణంగా బాగా చలిగా ఉందని వసు అంటుంది. దానికి రిషి వెంటనే ఆ చలి పోగొట్టేస్తాను అంటూ, వసుని కౌగిలించుకుంటాడు. దీంతో, ఇద్దరూ ఆనందంగా నవ్వుకుంటారు. బ్యాగ్రౌండ్ లో మంచి రొమాంటిక్ సాంగ్ ప్లే అవుతూ ఉంటుంది. ఆ తర్వాత వసుధార కిచెన్ లో వాటర్ బాటిల్ తీసుకొని లోపలికి వెళ్తుంటే, వసుకి ఏదో ఫోన్ వస్తుంది. అది చిత్ర నుంచి. వెంటనే కాల్ బ్యాక్ చేస్తుంది. ఫోన్ కలవదు. దీంతో, ఆమె ఏదో ప్రాబ్లంలో ఉందని అర్థం చేసుకొని, తనను ఎలాగైనా రక్షించాలని అనుకుంటుంది.

Guppedantha Manasu Serial Today:24th November VasuDhara is accused ram

ఆ తర్వాత ఉదయం ఇంట్లో రిషి, మహేంద్రలకు టిఫిన్ పెడుతూ ఉంటుంది. మహేంద్రను కాలేజ్ కి రమ్మని రిషి అడిగితే, దానికి ఆయన సరే అంటాడు.  ఆ తర్వాత వసుని రిషి, రాత్రి ఎక్కడికి వెళ్లావ్ అని అడుగుతాడు. దానికి వసు సమాధానం చెప్పేలోగా, రిషికి ఒక ఫోన్ వస్తుంది.  అది కూడా ఓ ఎస్ఐ నుంచి వస్తుంది. మీ కాలేజీలో చదివే చిత్ర అనే అమ్మాయి సూసైడ్ అంటెప్ట్ చేసిందని, ఆస్పత్రిలో ప్రాణాపాయ స్థితిలో ఉందని చెబుతారు. దీంతో, వీళ్లు వెంటనే బయలుదేరి ఆస్పత్రికి వెళతారు. ఇక, హాస్పిటిల్ లో చిత్ర తల్లిదండ్రులు ఏడుస్తూ ఉంటారు. డాక్టర్లు ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు.  ఈలోగా రిషి వాళ్లు అక్కడికి వచ్చేస్తారు.

అయితే, చిత్ర ఆత్మహత్యాయత్నం చేయడానికి వీళ్లే కారణం అని రిషి, వసులను చూపిస్తూ ఆమె బాయ్ ఫ్రెండ్ ఆరోపణలు చేస్తాడు. మీ వళ్లే జరిగింది అంటూ ఆరోపిస్తూఉంటాడు. అసలు, ఏం జరిగిందో అర్థంకాక ఆలోచిస్తూ ఉంటారు. ఈలోగా డాక్టర్ బయటకు వస్తుంది.  ఎలా ఉంది అంటే, ట్రీట్మెంట్ జరుగుతోందని, ఇప్పుడప్పుడే చెప్పలేం అని డాక్టర్లు చెబుతారు. తను తమ కాలేజీ స్టూడెంట్ అని, మంచి అమ్మాయి అని, బాగా చదువుతుందని, ఎలాగైనా కాపాడండి అని రిషి డాక్టర్ ని అడుగుతాడు. దీంతో, ఎప్పటిలాగానే మా వంతు ప్రయత్నం చేస్తాం అంటూ రొటీన్ డైలాగ్ కొడుతుంది.  ఆ తర్వాత ఈ విషయం మీడియాకు తెలిసిపోయిందని, ఈ విషయం మీరే హ్యాండిల్ చేసుకోవాలి అని ఆ డాక్టర్ సలహా ఇస్తుంది.

ఆ తర్వాత మహేంద్ర అసలు ఏం జరిగింది రిషి అని అడుగుతాడు. రిషి, కాలేజీలో జరిగిన విషయం చెబుతాడు. ఆ తర్వాత ఇలా జరిగిందంటాడు. అయితే, చిత్ర బాయ్ ఫ్రెండ్ మాత్రం దీనంతటికీ వసునే కారణం అని ఆరోపిస్తాడు. వసు.. చిత్రను బెదిరించిందని, అందుకే అలా చేసిందని అంటాడు. రిషి మాత్రం ఆ అబ్బాయిని బెదిరిస్తాడు. కానీ,   రాత్రి ఫోన్ వచ్చినప్పుడు ఈ వసుధార ఏదో చేసి ఉండాలి. అందుకే, ఇప్పుడు ఈ సమస్య వసు మెడకు చుట్టుకున్నట్లు తెలుస్తోంది. వసు కూడా ఏం చేయాలో తెలియక తల పట్టుకుంటుంది.

ఈలోగా పోలీసులు హాస్పిటల్ కి వచ్చి, వసుధారను అరెస్టు చేస్తున్నామని చెబుతారు.  చిత్ర సూసైడ్ అంటెప్ట్ చేయడానికి కారణం వసుధార అనే  ఫిర్యాదు వచ్చిందని, అందుకే ఇలా వచ్చామని పోలీసులు చెబుతారు. ఈలోగా ఆ చిత్ర బాయ్ ఫ్రెండ్ కూడా వసుధార మేడమ్ కారణంగానే చిత్ర అలా చేసిందని అంటాడు. అయితే, రిషి పోలీసులను ఆపుతాడు. ఏ ఆధారాలతో వసుని అరెస్ట్ చేస్తారంటాడు..? దానికి పోలీసులు తమ వద్ద ఆధారాలు ఉన్నాయని, తమ వద్ద సూసైడ్ లెటర్ ఉందని వారు చెబుతారు. ఆ సూసైడ్ లెటర్ లో తాను ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకోకుండా, వసుధార మేడమ్ అడ్డుకుంటున్నారని, అందుకే తాను సూసైడ్ చేసుకుంటానని రాసిందని పోలీసులు చెబుతారు. ఇదంతా అబద్ధం అని రిషి అనగా, లెటర్ మాత్రమే కాదని, తమ వద్ద వీడియో కూడా ఉందని పోలీసులు చెబుతారు.

Guppedantha Manasu Serial Today:24th November VasuDhara is accused ram

ఆ వీడియో చూపిస్తారు. ఆ వీడియోలో వసు చిత్ర కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ కనిపించింది. ఏం మాట్లాడింది అనేది మాత్రం వినపడలేదు. ఆ వీడియో ఆధారంగానే వసుని అరెస్టు చేయడానికి వచ్చామని పోలీసులు చెబుతారు. వీడియోలో వసు, ఆ అబ్బాయిని బెదిరిస్తున్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది. దీంతో, రిషి కూడా షాకౌతాడు. నాకు తెలీకుండా నువ్వు చిత్రను కలిశావా? అని అడుగుతాడు . కలిశాను అని చెబుతుంది. ఆలోగా, మీడియా వాళ్లు రావడం, చిత్ర బాయ్ ఫ్రెండ్ రెచ్చిపోతాడు. తమ ప్రేమను అందరి ముందు ఫ్రేమ్ చేసి, మీడియా ముందు చెప్పి, పరువు తీస్తానని వసుధార మేడమ్ బెదిరించిందని, అందుకే చిత్ర సూసైడ్ చేసుకుందని అతను చెబుతాడు. ఇక మీడియా వాళ్లు ప్రశ్నల వర్షం కురిపిస్తారు. మీరు మేజర్లే కదా మీరు ప్రేమించికుంటే ఆమెకు ఏంటి ప్రాబ్లం అంటే, చిత్ర డీబీఎస్టీ కాలేజీలో చదువుతోందని అదే మా ప్రాబ్లం అని చెబుతాడు. వాళ్ల కాలేజీ స్టూడెంట్ ప్రేమించి పెళ్లి చేసుకుంటే, తమ కాలేజీకి చెడ్డ పేరు వస్తుందని ఇలా చేశారని ఆరోపిస్తాడు. అప్పటికీ, తాను కాళ్లావేళ్లా పడి బతిమిలాడామని చెబుతాడు. అయితే, వసు అదంతా అబద్ధం అని చెబుతుంది.వీడియోలో తాను మాట్లాడింది వేరు అని చెబుతుంది. వాళ్లు నిజంగా ప్రేమించుకుంటే తాను ఎందుకు కాదు అంటాను అని పోలీసులకు అర్థమయ్యేలా చేసే ప్రయత్నం చేస్తుంది. చిత్ర పేరెంట్స్ కూడా వసుధార బెదిరించడం వల్లే ఇలా చేసుకుందని చెబుతారు. అది విని అందరూ షాకౌతారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తయ్యింది. అయితే, దీని వెనక కూడా శైలేంద్ర కుట్ర ఉందని అనుమానం ఉంది. మరి, ఈ కేసు నుంచి వసు ఎలా బయటపడుతుందో, దీనిని ఎన్ని రోజులు లాగుతారో చూడాలి.

Follow Us:
Download App:
  • android
  • ios