05:46 PM (IST) Oct 30

హరితేజ పై ప్రేరణ షాకింగ్ కామెంట్స్

ఓ టాస్క్ లో గెలిచిన హరితేజ టీం ని బిగ్ బాస్ ఆదేశించాడు. మిగిలిన మూడు టీమ్స్ లో ఒక టీమ్ కి ఎల్లో కార్డు ఇవ్వాలని సూచించాడు. హరితేజ రెడ్ కలర్ టీమ్ కి ఎల్లో కార్డు ఇచ్చింది. ఈ టీమ్ లో గౌతమ్, ప్రేరణ, యష్మి ఉన్నారు. హరితేజను ఉద్దేశిస్తూ.. ఆమె ముఖం చూస్తూనే చిరాకు వస్తుంది నాకు అని యష్మితో ప్రేరణ అన్న వీడియో వైరల్ అవుతుంది. 

Scroll to load tweet…
03:20 PM (IST) Oct 30

స్లీపింగ్ రేస్ ఛాలెంజ్, రోహిణి తీరుకు నయని కన్నీళ్లు

కంటెస్టెంట్స్ ని నాలుగు టీమ్స్ గా విభజించి బిగ్ బాస్ గేమ్స్ కండక్ట్ చేస్తున్నాడు. దీనిలో భాగంగా స్లీపింగ్ రేస్ ఛాలెంజ్ పేరుతో ఒక టాస్క్ నిర్వహించాడు. ఈ టాస్క్ జరిగే సమయంలో ఒకే టీం కి చెందిన రోహిణి, నయని మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. నయని కన్నీరు పెట్టుకుంది.

YouTube video player

12:32 PM (IST) Oct 30

లవ్ బర్డ్స్ యష్మి-నిఖిల్ మధ్య చిచ్చుపెట్టిన టాస్క్

పానిపట్టు యుద్ధం అనే టాస్క్ రసాభాసకు దారి తీసింది. తమ ట్యాంక్స్ లోని వాటర్ కాపాడుకునే క్రమంలో టీమ్స్ ఆడామగా తేడా లేకుండా కొట్టుకున్నారు. కలబడ్డారు. ఈ టాస్క్ లో వేరు వేరు టీమ్ లలో ఉన్న నిఖిల్-యష్మి మధ్య మాటల యుద్ధం నడిచింది. అనంతరం నిఖిల్ ని యష్మి కన్విన్స్ చేసే ప్రయత్నం చేసింది. కానీ అతడు వినలేదు. 

12:30 PM (IST) Oct 30

అమ్మాయిలు అబ్బాయిలు అనే తేడా లేకుండా కొట్టుకున్నారు!

పానిపట్టు యుద్ధం అనే టాస్క్ రసాభాసకు దారి తీసింది. తమ ట్యాంక్స్ లోని వాటర్ కాపాడుకునే క్రమంలో టీమ్స్ ఆడామగా తేడా లేకుండా కొట్టుకున్నారు. కలబడ్డారు. లేటెస్ట్ ప్రోమో ఆసక్తి రేపుతోంది. 

YouTube video player

09:41 AM (IST) Oct 30

కమ్యూనిటీ కామెంట్స్, సారీ చెప్పిన మెహబూబ్

బిగ్ బాస్ హౌస్లో మెహబూబ్ తోటి కంటెస్టెంట్ నబీల్ తో ఒక కమ్యూనిటీ ఓట్లు మనకు మాత్రమే పడతాయని అన్నాడు. ఈ కామెంట్స్ పెద్ద వివాదం రాజేశాయి. గత వారం ఎలిమినేటైన మెహబూబ్ ఈ కామెంట్స్ పై స్పందించాడు. నాకు ఎలాంటి క్యాస్ట్, కమ్యూనిటీ ఫిలింగ్ లేదన్నాడు. అదే సమయంలో క్షమాపణలు చెప్పాడు. 

Scroll to load tweet…
09:32 AM (IST) Oct 30

బిగ్ బాస్ హౌస్లో దొంగలు

బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కి సరిపడా తిండి, నిద్ర ఉండదు. చాలా మంది ఫుడ్ దొంగిలించి దాచుకుంటారు. నిన్న విష్ణుప్రియ రేషన్ తీసుకురాగా.. అవినాష్, యష్మితో పాటు కొందరు కంటెస్టెంట్స్ దొంగతనంగా ఫుడ్ తీసుకుపోయారు. 

Scroll to load tweet…
06:42 AM (IST) Oct 30

పృథ్వికి విష్ణుప్రియ వార్నింగ్

తనను కాదని నయని పావనికి దగ్గరవుతున్న పృథ్విరాజ్ కి విష్ణుప్రియ వార్నింగ్ ఇచ్చింది. నయని-పృథ్విరాజ్ ఒకే కొబ్బరి బొండంలో నీళ్లు తాగారు. ఇది విష్ణుప్రియకు నచ్చలేదు. అదే సమయంలో తనను దూరం పెట్టొద్దని రిక్వెస్ట్ చేసుకుంది. మనకు బ్రేకప్ అయిందిగా అని విష్ణుప్రియను పృథ్వి మరింత ఉడికించాడు.