06:48 PM (IST) Oct 20

ప్రేరణపై చేసిన ఈ మీమ్ చూస్తే నవ్వు ఆపుకోలేరు!

ప్రేరణ బిగ్ బాస్ హౌస్లో గెంతుతూ వెళుతున్న వీడియో పై ఒక మీమ్ తయారు చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. చూస్తూ నవ్వు ఆపుకోలేరు. 

Scroll to load tweet…
04:36 PM (IST) Oct 20

కంటెస్టెంట్స్ పై హిలేరియస్ మీమ్స్, గంగవ్వ కేక!

బిగ్ బాస్ కంటెస్టెంట్స్, హౌస్లో చోటు చేసుకునే ఘటనల మీద మీమ్స్ రాయుళ్లు అదిరిపోయే ఎడిట్ వీడియోలు చేస్తుంటారు. విష్ణుప్రియ పై గంగవ్వ వేసిన పంచ్ లకు సంబందించిన వీడియో నవ్వులు పూయించింది. మొత్తం మూడు మీమ్ వీడియోలు నాగార్జున ప్లే చేశాడు. 

YouTube video player

04:29 PM (IST) Oct 20

అవినాష్ కి నాగార్జున అదిరిపోయే పంచ్!

కంటెస్టెంట్ అవినాష్ కి నాగార్జున అదిరిపోయే పంచ్ వేశాడు. నేను పెద్దవాడిని నాకు రెస్పెక్ట్ కావాలని నామినేషన్స్ లో అవినాష్ పృథ్విరాజ్ తో వాదించాడు. ఇదే విషయమై నాగార్జున అవినాష్ మీద పంచ్ వేశాడు. 
YouTube video player

11:27 AM (IST) Oct 20

సండే ఫండే, బిగ్ బాస్ హౌస్లో ఫుల్ ఎంటర్టైన్మెంట్

బిగ్ బాస్ హౌస్లో సండే అంటే ఫండే. హోస్ట్ నాగార్జున కంటెస్టెంట్స్ ని అబ్బాయిలు, అమ్మాయిలుగా విభజించారు. రెండు టీమ్స్ మధ్య చిత్రం భళారే విచిత్రం టాస్క్ పెట్టారు. దీనికి సంబంధించిన ప్రోమో నవ్వులు పూయిస్తోంది. 

YouTube video player

10:35 AM (IST) Oct 20

ఓటింగ్ లో వెనుకబడ్డ గౌతమ్, మణికంఠ సెల్ఫ్ ఎలిమినేషన్

ఆడియన్స్ ఓటింగ్ ప్రకారం ఎలిమినేషన్ ఉంటుంది. గౌతమ్ కి తక్కువ ఓట్లు వచ్చినట్లు నాగార్జున ప్రకటించాడట. అయితే నాగ మణికంఠ సెల్ఫ్ ఎలిమినేట్ అయ్యాడట. తాను స్వయంగా వెళ్లిపోతానని నిర్ణయం తీసుకున్నాడట. ఈ మేరకు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది.

Scroll to load tweet…
08:18 AM (IST) Oct 20

యష్మి చెప్పిందే నిజమైంది.. మణికంఠ ఎలిమినేషన్‌కి అసలు కారణాలు..

మణికంఠ ఎలిమినేషన్‌కి సంబంధించిన అసలు కారణాలు తెలుస్తున్నాయి. బిగ్‌ బాస సంచలన నిర్ణయం వెనుక ఏం జరిగిందనేది తెలుస్తుంది. 

బిగ్‌ బాస్‌ సంచలన నిర్ణయం.. టేస్టీ తేజని కాదని మణికంఠని ఎలిమినేషన్‌కి అసలు కారణమిదే, యష్మి చెప్పిందే నిజమైంది?

07:18 AM (IST) Oct 20

మణికంఠ ఎలిమినేషన్‌కి అసలు కారణం ఇదే

బిగ్‌ బాస్‌తెలుగు 8వ సీజన్‌ ప్రస్తుతం ఏడో వారం ముగింపుకి చేరింది. ఈ వారం ఎవరు ఎలిమినేట్‌ అవుతారనేది ఇంట్రెస్టింగ్‌గా మారింది. అయితే ఓటింగ్‌ ప్రకారం టేస్టీ తేజ ఎలిమినేట్‌ అవుతారని భావించారు. కానీ అనూహ్యంగా బిగ్‌ బాస్‌.. మణికంఠని ఎలిమినేట్‌ చేస్తున్నట్టు తెలుస్తుంది. మరి ఆయన ఎలిమినేషన్‌పై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. అతన్ని కావాలని ఎలిమినేట్‌ చేస్తున్నారనే ప్రచారం జరుగుతుంది. అదే సమయంలో అతని ఎలిమినేషన్‌ మంచిదే అంటున్నారు. ఇదే ఇప్పుడు హాట్‌ టాపిక్‌. ఈ నేపథ్యంలో మణికంఠ ఎలిమినేషన్‌కి అసలు కారణాలు స్పష్టం తెలుస్తున్నాయి.