బిగ్ బాస్ హౌస్లో ఫినాలే రేసు జరుగుతుంది. టాప్ 8 కంటెస్టెంట్స్ నుండి ఒకరు నేరుగా ఫైనల్ కి వెళ్లే అవకాశం బిగ్ బాస్ ఇచ్చారు. టికెట్ టు ఫినాలే గెలిచిన వాళ్ళు ఫైనల్ కి వెళతారు.
బిగ్ బాస్ తెలుగు 7 చివరి దశకు చేరుకుంది. మరో మూడు వారాల్లో షో ముగియనుంది. హౌస్లో 8 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. వీరిలో ఐదుగురు మాత్రమే ఫైనల్ కి వెళతారు. మిగతా ముగ్గురు ఎలిమినేట్ అవుతారు. కాగా ఒకరికి నేరుగా ఫైనల్ కి వెళ్లే ఛాన్స్ ఇచ్చాడు బిగ్ బాస్. ఫినాలే అస్త్ర గెలుచుకున్న కంటెస్టెంట్ ఫైనలిస్ట్ అవుతారు. దశల వారీగా నిర్వహిస్తున్న టాస్కులలో కొందరు ఎలిమినేట్ అవుతూ వచ్చారు.
శోభ, శివాజీ, ప్రియాంక, యావర్ రేసు నుండి తప్పుకున్నారు. నిన్న ఎపిసోడ్లో గౌతమ్ కూడా ఎలిమినేట్ అయ్యాడు. ఇక మిగిలింది ముగ్గరే. వీరిలో అమర్ టాప్ లో ఉన్నాడు. రేసు నుండి తప్పుకున్న గౌతమ్ తన పాయింట్స్ అమర్ కి ఇచ్చాడు. దీంతో అమర్ స్కోర్ 1000 కి చేరింది. రెండు టాస్కులలో గెలిచిన పల్లవి ప్రశాంత్ 860 పాయింట్స్ రెండో స్థానంలో ఉన్నాడు. 710 పాయింట్స్ తో అర్జున్ మూడో స్థానంలో ఉన్నాడు.
ప్రస్తుతానికి అమర్ టికెట్ టు ఫినాలే గెలిచేలా ఉన్నాడు. అయితే పల్లవి ప్రశాంత్ నుండి గట్టి పోటీ ఎదురవుతుంది. ఒకవేళ అర్జున్ రేసు నుండి తప్పుకుంటే తన పాయింట్స్ అమర్, ప్రశాంత్ లలో ఎవరికీ ఇస్తాడు అనేది ఆసక్తికరంగా మారింది. ప్రశాంత్ కి ఇస్తే అతడు విన్నర్ అయ్యే ఛాన్స్ ఉంది. టాస్కులలో చూపించే పెర్ఫార్మన్స్ కూడా విజయావకాశాలు మెరుగయ్యేలా చేస్తుంది. అమర్ కి చెప్పుకోవడానికి ఒక్క అఛీవ్మెంట్ లేదు. కనీసం టికెట్ టు ఫినాలే గెలవాలని ఆశపడుతున్నాడు. అయితే టికెట్ టు ఫినాలే అమర్, ప్రశాంత్ కంటే అర్జున్ కే ముఖ్యం.
Bigg Boss Telugu 7 : ఫినాలే రేస్.. అదరగొట్టిన రైతుబిడ్డ.. అమర్ చేసిన పనికి యావర్ కన్నీళ్లు
