ఇయర్ ఎండింగ్ లో టీవీ యాంకర్ల బిగ్ ఫైట్

TV ANCHORS FIGHT ON BIG SCREEN
Highlights

  • ఇయర్ ఎండింగ్ లో చిన్న సినిమాల హవా
  • ఈ శుక్రవారం విడుదలైన 12పైగా చిన్న సినిమాలు
  • ఈ సినిమాల్లో క్లోజ్ ఫ్రెండ్స్ అయిన టీవీ యాంకర్ల ఫైట్
  • విడుదలైన రవి,శ్రీముఖి, జయతి లాంటి యాంకర్ల సినిమాలు

తెలుగులో ఈ యేడాది చివర్లో చిన్న సినిమాల హవా మొదలైంది. నవంబర్ నుంచి మొదలైన చిన్న సినిమాల దూకుడు ఇంకా కొనసాగుతోంది. పెద్ద సినిమాలు ఏవీ లేకపోవడంతో ఈ శుక్రవారం ఒకేసారి 12పైగా సినిమాలు విడుదలయ్యాయి. వాటిలో కాస్త ఆసక్తి ఉన్న సినిమాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ వారం రిలీజైన సినిమాల్లో మెజారిటీ సినిమాలు బుల్లితెరపై రారాజులుగా, రారాణులుగా వెలుగొందుతున్న యాంకర్లవి. ఈ యాంకర్లలో శ్రీముఖి అడపాదడపా సినిమాలు చేస్తోంది. తాజాగా నందు, శ్రీముఖి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘కుటుంబ కథా చిత్రం’ వాటిలో ఒకటి. ఈ సినిమాను సస్పెన్స్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించారు. చరణ్(నందు), పల్లవి(శ్రీముఖి) పెళ్లి చేసుకొని ఎనిమిదేళ్లు పూర్తవుతుంది. వృత్తిరీత్యా ఇద్దరూ బిజీగా ఉండడంతో ఒకరితో మరొకరు సమయం గడిపే అవకాశం దొరకదు. దీంతో ఒకరికి తెలియకుండా మరొకరు బాధ పడుతూ ఉంటారు. ఆ కారణంగా ఇంట్లో తరచూ గొడవలు జరుగుతుంటాయి. వీరి ఇంటి వాచ్‌మ్యాన్(కమల్ కామరాజు) చరణ్, పల్లవి ఇబ్బందులను చూస్తూ జాలి పడుతుంటాడు. ఈ క్రమంలో వారి జీవితాల్లో ఎలాంటి మలుపులు చోటుచేసుకున్నాయనే అంశాలతో సినిమాను తెరకెక్కించారు.

 

ఇక యాంకర్ రవి హీరోగా పరిచమైన  చిత్రం `ఇది మా ప్రేమ కథ`. `శశిరేఖా పరిణయం` సీరియల్ ఫేమ్ మేఘన లోకేష్ కథానాయికగా నటించింది. మత్స్య క్రియేషన్స్-పి.ఎల్.కె ప్రొడక్షన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాతో.. అయోధ్య కార్తీక్ దర్శకుడిగా పరిచయమవుతుండగా.. కార్తీక్ కొడకండ్ల సంగీత ద‌ర్శ‌క‌త్వం వహించారు. ప‌రిశ్ర‌మ‌కి యాంక‌ర్‌గా వ‌చ్చి ఏడేళ్ల‌యింది. ఒక‌వేళ వెండితెర‌ క‌థానాయ‌కుడిగా చేస్తే ఒకే సినిమాకి ప‌రిమితం కాకూడ‌దు. అందుకే నా ప‌రిచ‌య చిత్రం ఎంతో ప్ర‌తిష్ఠాత్మ‌కంగా ఉండాల‌ని భావించి చేశానని ఫైనల్ గా చాలా మంది సజెషన్స్ తీసుకొని ఈ సినిమా చేశానని...  మెగాస్టార్ చిరంజీవి, సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్‌, మాస్ రాజా ర‌వితేజల నుంచి ఇనిస్పైర్ అయి.. ఇదీ మా ప్రేమకథ చేశానని రవి అన్నాడు.

 

ఇక జెమిని మ్యూజిక్ ఛానెల్లో వెన్నెల అనే కార్యక్రమం ద్వారా బుల్లితెర ప్రేక్ష‌కుల‌కి ద‌గ్గ‌రైన జ‌య‌తి మొట్ట‌మొదటిసారిగా హీరోయిన్‌గా న‌టిస్తూ నిర్మిస్తున్న చిత్రం ‘ల‌చ్చి’. జె9 4షోస్ బ్యాన‌ర్ పై ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం ద్వారా ఈశ్వ‌ర్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నాడు. వైవిద్యమైన హార్ర‌ర్ కామెడీని ఈ చిత్రంలో చూపించారు. చాలా టీవి ప్రోగ్రామ్స్ ప్రొడ్యూస్ చేసిన అనుభవంతో మొట్ట‌మొద‌టిసారిగా సినిమా నిర్మాణం చేపట్టి.. క‌థ న‌చ్చి నేను మెయిన్ లీడ్‌లో న‌టించాను. హార్ర‌ర్ కామెడీ చిత్రాలు చాలానే వచ్చాయి. కానీ లచ్చి చిత్రం కొత్త అనుభూతిని అందిస్తుంది. వైవిధ్యమైన కథ, కథనం ప్రేక్షకుల్ని థ్రిల్‌కు గురి చేస్తుంది. ఈ చిత్రం అంతా ల‌చ్చి పాత్ర చుట్టూనే తిరుగుతుంది. అనేక మలుపులు ఆడియెన్స్‌ని ఎంటర్‌ టైన్ చేస్తాయి. ప్ర‌ముఖ క‌మెడియ‌న్స్ ఇందులో కడుపుబ్బా నవ్విస్తారని చెప్పింది.

మొత్తానికి ఇలా బుల్లితెరలో మాంచి క్రేజ్ వున్న యాంకర్లంతా ఈ శుక్రవారం వెండితెరపై పోటీపడటం విశేషం.

loader