ప్రముఖ టీవీ నటి.యాంకర్ మల్లిక మృతి బెంగళూరులోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి గత కొంత కాలంగా అనారోగ్యం పాలై చికిత్స పొందుతున్న మల్లిక 

తెలుగు టీవీ తొలితరం యాంకర్స్ లో ఒకరైన ప్రముఖ టీవీ నటి, యాంకర్‌ మల్లిక (39) అనారోగ్యంతో మృతి చెందారు. గత 20 రోజులుగా ఆమె కోమాలో ఉన్నారు. సోమవారం మల్లిక ఓ ప్రయివేట్‌ ఆస్పత్రిలో మరణించారు.

మహేష్‌ బాబు హీరోగా నటించిన ‘రాజకుమారుడు’ చిత్రంలో మల్లిక నటించారు. అలాగే పలు టీవీ సీరియల్స్‌లోనూ నటించారు. ఆమె అసలు పేరు అభినవ. మల్లిక అంత్యక్రియలు మంగళవారం హైదరాబాద్‌లో జరగనున్నాయి. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.