ఆటో డ్రైవర్ తో నటి చెత్త బిహేవియర్.. గొడవ పెట్టుకుని డబ్బులివ్వకుండా వెళ్లిపోయిన వైనం
కన్నడ బుల్లితెర నటి పద్మిని తాజాగా వార్తల్లో నిలిచింది. చెత్త బిహేవియర్ తో పద్మిని విమర్శల పాలు అవుతోంది. బుల్లితెర నటిగా పద్మిని మంచి గుర్తింపు సొంతం చేసుకుంది.

కన్నడ బుల్లితెర నటి పద్మిని తాజాగా వార్తల్లో నిలిచింది. చెత్త బిహేవియర్ తో పద్మిని విమర్శల పాలు అవుతోంది. బుల్లితెర నటిగా పద్మిని మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. అయితే సోషల్ మీడియాలో ఆమె ట్రోలింగ్ కి గురి కావడానికి కారణం ఏంటో ఇప్పుడు చూద్దాం.
వివరాల్లోకి వెళితే నటి పద్మిని బెంగళూరులో మల్లేశ్వరంలోని మార్గోసా రోడ్ నుంచి బాణా శంకరికి ఉబర్ ఆటో బుక్ చేసుకుంది. దీనితో ఆటో డ్రైవర్ ఆమెని పిక్ చేసుకున్నారు. ఆటో ఛార్జి రూ 437 యాప్ లో చూపించింది. కొంత దూరం ప్రయాణించాక ట్రాఫిక్ ఎక్కువైంది. ఆటో ట్రాఫిక్ లో చిక్కుకుంది. దీనితో నటి పద్మిని ఆటో డ్రైవర్ తో కావాలనే గొడవ పడింది.
ఈ రోడ్ లో ఎందుకు వచ్చావు.. నీకు ఆటో నడపడం వచ్చా అంటూ అతడిపై దూషణలకు దిగింది. ట్రాఫిక్ ఉంటే ఎవరు మాత్రం ఏం చేస్తారు అని డ్రైవర్ ఆమెకి చెప్పాడు. కానీ పద్మిని మాత్రం ఆటో దిగిపోయింది. ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోయింది. పైగా ఆటో డ్రైవర్ పై ఉబర్ యాజమాన్యానికి ఫిర్యాదు చేసింది.
దీనితో ఉబర్ యాజమాన్యం ఆటో డ్రైవర్ ని తాత్కాలికంగా తొలగించింది. దీనితో సదరు డ్రైవర్ నటి పద్మిని చేసిన నిర్వాకాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి కన్నీళ్లు పెట్టుకున్నాడు. తన తప్పు లేకపోయినప్పటికీ బలయ్యానని వాపోయాడు. దీనితో నెటిజన్లు ఆటో డ్రైవర్ కి మద్దతు తెలుపుతున్నారు. నటి పద్మిని కక్కుర్తితో డబ్బులు చెల్లించకుండా వెళ్ళింది అంటూ దుయ్యబడుతున్నారు. ట్రాఫిక్ ఉన్నప్ప్పుడు కాస్త ఆలస్యం అవుతుంది. ఆ మాత్రానికే గొడవ పడాలా అని ప్రశ్నిస్తున్నారు. ఆమె డబ్బులు చెల్లించాల్సి వస్తుందనే ఇలా చేసింది అని అంటున్నారు.