టీవీ నటుడు కరణ్‌ మెహ్రా, నిషా రావల్‌ ల మధ్య వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా నిషా రావల్‌ మరో ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. తాను బైపోలార్‌ డిజార్డర్‌తో బాధపడుతున్నట్టు తెలియజేసింది. అదే సమయంలో భర్త కరణ్‌కి వివాహేతర సంబంధాలున్నాయనే విషయాలను బహిర్గతం చేసింది. 

వీరిద్దరు మ్యారేజ్‌ చేసుకున్నప్పుడు హిందీ టీవీ పరిశ్రమలో వీరిని బెస్ట్ కపుల్‌ అని ప్రశంసించారు. కానీ ఇప్పుడు వీరిద్దరు బద్ద శత్రువులుగా మారిపోయారు. ఇటీవల నిషా తన భర్త, నటుడు కరణ్‌పై షాకింగ్‌ ఆరోపణలు చేసింది. తాను గృహ హింసకి ఎదుర్కొన్నట్టు తెలిపింది. అదే సమయంలో భర్త కరణ్‌పై వివాహేతర సంబంధం గురించి దిగ్ర్భాంతికరమైన ఆరోపణలు చేసింది. ఈ నేపథ్యంలో భార్యని హింసించాడనే ఆరోపణలో కరణ్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఆయన బెయిల్‌పై విడుదలయ్యారు.

తాజాగా ఓ మీడియాతో నిషా మరిన్ని షాకింగ్‌ విషయాలను వెల్లడించింది. తన భర్తకి వివాహేతర సంబంధం ఉందని ఆమె వెల్లడించింది. తనతో వివాదం తర్వాత ఆ విషయాన్ని తను అంగీకరించినట్టు తెలిపింది. అయితే ఈ విషయంలో అతను పాశ్చత్తాపం చూపించలేదు. తప్పుగా భావించలేదు. నేను అతన్నుంచి విడిపోవాలని నిర్ణయించుకున్నప్పుడు కూడా అతనిలో ఎలాంటి రియలైజేషన్‌ కనిపించలేదని పేర్కొంది.

ఆమె ఇంకా మాట్లాడుతూ, `నేను అతన్ని చాలా ప్రేమించాను. అతను నైతికంగా, బహిరంగంగా అప్పుడు మంచి ప్రవర్తన కలిగి ఉన్నాడు. దీంతో ఇద్దరం మ్యారేజ్‌ చేసుకున్నాం. అతను చేసే పనికి నేను మద్దతు ఇస్తూ వచ్చాను. కానీ గత రాత్రి నేను రియలైజ్‌ అయ్యాను. నాకుమారుడు నేను చాలా వీక్‌ అని అనుకోకూడదని ఈ నిర్ణయానికి వచ్చాను. ఒకరిని మానసికంగా, శారీరకంగా ఇబ్బంది పెట్టే హక్కు ఎవరికీ లేదు` అని తెలిపింది. 

ఇంకా చెబుతూ, `తాను బైపోలార్‌ డిజార్డర్‌తో బాదపడుతున్నా. ఇది తీవ్రమైన గాయం కారణంగా జరుగుతుంది. కొన్ని సార్లు మాత్రమే జన్యువు కారణంగా జరుగుతుంది. నాకు బైపోలార్‌ డిజార్దర్ ఉన్నట్టు నిర్ధారణ అయ్యింది. అలాగని నేను సైకో కాదు. ఇదొక మానసిక రుగ్మత. నేను ఇప్పుడు బాగానే ఉన్నాను. కెరీర్‌ని బ్యాలెన్స్ చేస్తున్నాను` అని తెలిపింది. 

గతంలో తాను ఐదు నెలల సమయంలో గర్భస్రావం జరిగిందని వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాను చాలా ఇబ్బంది పడినట్టు ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. అయితే ఆ సమయంలో కరణ్‌ తనకి మద్దతుగా లేడని చెప్పింది. దాదాపు ఆరేళ్లు ప్రేమించుకున్న ఈ జోడి 2012లో పెళ్లి చేసుకున్నారు. 2017లో వీరికి కుమారుడు జన్మించాడు. ఆ తర్వాత వీరిద్దరి మధ్య మనస్పార్థాలు పెరిగాయి. వీరిద్దరు ఇప్పుడు విడిపోయే ఆలోచనలో ఉన్నారట.