తమిళనాడులో స్టెరిలైట్ కర్మాగార వ్యతిరేక ఆందోళనలో పోలీసులు విచక్షణారహితంగా కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. తూత్తుకుడిలో చోటు చేసుకున్న ఈ సంఘటనపై సోషల్ మీడియాలో పలువురు కామెంట్లు చేశారు. ప్రముఖ టీవీ నటి నిలానీ కూడా ఈ విషయంపై స్పందించింది. ఆరోజు ఆమె పోలీస్ డ్రెస్ ధరించి షూటింగ్ లో పాల్గొన్నారు. దీంతో అదే డ్రెస్ లో ఓ వీడియో విడుదల చేశారు.

అందులో ఆమె పోలీసు డ్రెస్ తో నటిస్తున్నందుకు సిగ్గు పడుతున్నాను అంటూ తూత్తుకుడిలో జరిగిన సంఘటనపై పోలీసులను విమర్శించారు. దీంతో ఆమెపై కేసు నమోదు చేసి ఈ నెల 19న అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో ఆమె సైదాపేట కోర్టులో బెయిలు కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. కొన్ని షరతుల మీద ఆమెకు మేజిస్ట్రేట్ బెయిల్ మంజూరు చేశారు.