బిగ్ బాస్ విన్నర్ కౌశల్ వివాదం రోజురోజుకి ముదిరిపోతోంది. కౌశల్ ఆర్మీ పేరుతో ఏర్పాటు చేసిన ట్రస్ట్ లో విరాళాలను కౌశల్ దుర్వినియోగం చేస్తున్నాడని కౌశల్ ఆర్మీ సభ్యులే మీడియా ముందుకు రావడంతో వివాదం రాజుకుంది.

దీనిపై వివరణ ఇవ్వడానికి మీడియా ముందుకొచ్చిన కౌశల్ నటుడు తనీష్, టీవీ5 ప్రముఖ జర్నలిస్ట్ మూర్తిపై తీవ్ర ఆరోపణలు చేశాడు. తనీష్ తో కుమ్మక్కై మూర్తి తనను బ్యాడ్ చేస్తున్నాడంటూ కౌశల్ మీడియాలో చెప్పడంతో విషయం సీరియస్ అయింది.

కౌశల్ కామెంట్స్ విన్న మూర్తి ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. తన కౌశల్ ఒక్క ఆరోపణనైనా నిరూపించగలిగితే జర్నలిజం మానేస్తానని సవాల్ విసిరారు. మూర్తి తప్పు చేశాడని కౌశల్ ఆర్మీ సభ్యుల్లో ఒక్కరైనా.. నిరూపిస్తే ఉరి తీయించుకోవడానికి సిద్ధంగా ఉన్నానని అన్నారు. ఒకవేళ తాను చనిపోయిన తరువాత నిరూపించినా.. తన సమాధి దగ్గరకి వెళ్లి ద్రోహి అని ముద్ర వేయమని బహిరంగంగా సవాల్ విసిరారు.

లక్షల మంది ఆర్మీ ఉందని, వారందరితో ట్రోలింగ్ చేయిస్తా అని ఎంతమందిని బ్లాక్ మెయిల్ చేస్తారని మూర్తి ప్రశ్నించారు. మీరు బెదిరిస్తే మేము బెదిరిపోవాలా.. మీతో సినిమా చేయడానికి ఒప్పుకోని వారంతా క్రిమినల్స్ అయిపోతారా అంటూ ఫైర్ అయ్యారు.