Intinti Gruhalakshmi: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి  (Intinti Gruhalakshmi) సీరియల్ మంచి కాన్సెప్ట్ తో కొనసాగుతుంది. భర్తతో విడిపోయి కుటుంబం కోసం ఒంటరిగా పోరాడే మహిళ కాన్సెప్ట్ తో ప్రసారం అవుతున్న ఈ సీరియల్ ఈరోజు మార్చి 7వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో హైలెట్స్ తెలుసుకుందాం. 

ఈరోజు ఎపిసోడ్ లో లాస్య అజయ్ విషయంలో దివ్యని కన్విన్స్ చేయడానికి ప్రయత్నిస్తుండగా అప్పుడు తులసి అది కాదు ప్రశ్న నువ్వు నిజం ఎందుకు దాచి పెట్టావు అని అనడంతో ఎందుకంటే వ్యాపారంలో లాభం కోసం కేఫ్ లో సగం వాటా కోసం, నన్ను అమ్మేయాలని చూసింది అని దివ్య అనడంతో లాస్య షాక్ అవుతుంది. అప్పుడు అందుకే మనళ్లందరినీ పెళ్లిచూపులు అంటూ తొందర పెట్టింది అని ప్రేమ్ అనడంతో ఆగు ప్రేమ దివ్య అని మంచి కోసమే నీ కెరియర్ కోసమే నేను అదంతా చేశాను అని అనడంతో ఏంటి చేసిన మంచి అని అంటాడు నందు. నువ్వు కూడా అలా మాట్లాడతావ్ ఏంటి నందు వాళ్లు కోటీశ్వరులు నాలుగు తరాలు అయినా కూర్చుని తినే అంత ఆస్తి ఉంది మన దివ్య ఆ ఇంటి కోడలు అయితే ప్రిన్సెస్ లా బతికేయొచ్చు అని అంటుంది లాస్య.

కన్నతల్లిని కన్నతల్లిని అని చెప్పుకుంటూ తిరగడం కాదు కూతురికి నాలుగు మంచి మాటలు నేర్పించు నీలాగా సూక్తులు నేర్పించి దాని జీవితం నీ జీవితం లాగా తయారు చేయకు అనగా తులసి కోపంతో లాస్యని కొట్టబోతుంది. అప్పుడు చూసావా నందు నీ ముందే కొట్టడానికి చూస్తోంది అనడంతో నందు తులసి దగ్గరికి వెళ్లి తులసి చేయి లేపడం కాదు చెంప పగలగొట్టాల్సింది అనడంతో లాస్య షాక్ అవుతుంది. అప్పుడు నందు నా విషయంలో ఎన్ని తప్పులు అయినా చేయి భరిస్తాను కానీ నా కూతురు విషయంలో తప్పు చేస్తే మాత్రం సహించెను అని అంటాడు నందు. అయినా నేను చేసిన తప్పు ఏంటి దివ్య అని మంచి స్థాయిలో చూడాలనుకున్నాను అనడంతో డబ్బు కోసం నీలా అడ్డదారులు తొక్కడం,డబ్బు కోసం ఎంతకైనా దిగజారడం నీకు అలవాటు మాకు కాదు అని అంటుంది.

చూడు నా కూతురు లో ఉంది నా రక్తం. నాకు ప్రేమ అభిమానం వ్యక్తిత్వం మర్యాద ఇవి మాత్రమే తెలుసు. ఈ పదాలు నీకు తెలియదు అనుకుంటా. నా కూతుర్ని పెళ్లి చేసుకోబోయే వాడు మహారాజు కాకపోయినా మనసులో పెట్టుకుని చూసుకునేవాడు ఉంటే చాలు. నా కూతురినీ ప్రేమగా చూసుకునేవాడు ఉంటే చాలు అని అంటుంది తులసి. ఇదే విషయాన్ని నీ భార్యకు అర్థమయ్యేలా చెప్పు అని నందుకు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది తులసి. అప్పుడు దివ్య నాన్న కొంతమందికి సాఫ్ట్ గా చెప్తే అర్థం కాదు వార్నింగ్ ఇవ్వాలి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వైపు రాజ్యలక్ష్మి ఆఫీస్ ఫైల్స్ చూస్తూ ఉండగా ఇంతలో బసవయ్య అక్కడికి వచ్చి విక్రమ్ పెళ్లి గురించి మాట్లాడుతూ ఉండగా ఇంతలోనే అక్కడికి మ్యారేజ్ బ్యూరో రావడంతో అక్క నువ్వు చాలా ఫాస్ట్ గా ఉన్నావు అని అంటాడు బసవయ్య.

 ఇంతలోనే అక్కడికి విక్రమ్ వచ్చి అమ్మ నేను అలా మార్కెట్ వరకు వెళ్ళొస్తాను అనడంతో దేవుడు ఉన్నాడు కదా అనగా నీ కోసమే కదా అమ్మ వెళ్ళొస్తాను అని అంటాడు విక్రమ్. అప్పుడు రాజ్యలక్ష్మి పెళ్లి చేయాలనుకుంటున్నాను అందుకే మంచి సంబంధం చూస్తున్నాను అని అంటుంది. ఆ మాటలకు విక్రమ్ షాక్ అవుతాడు. అప్పుడు రాజ్యలక్ష్మి తల్లిగా అడుగుతున్నాను నీ మనసులో ఎవరైనా ఉంటే చెప్పు పెళ్లి చేస్తాను అనడంతో విక్రం దివ్య గురించి ఆలోచించి నా మనసులో ఎవరూ లేరమ్మ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత దేవుడు విక్రమ్ వెనకాలే ఫాలో అయ్యి ఏంటి విక్రం బాబు మంచి అవకాశం వస్తే చేజార్చుకున్నావు అనడంతో నా మనసులో ఆ అమ్మాయి ఉంది ఆ అమ్మాయి మనసులో నేను ఉన్నానో లేదో కదా కాబట్టి అప్పటివరకు ఈ దాగుడుమూతలు తప్పవు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు విక్రమ్.

 ఆ తర్వాత రాజ్యలక్ష్మి కి మ్యారేజ్ బ్యూరో ఫోటోలు చూపించగా ధనవంతుల అమ్మాయి కాదు నాతో పాటు రా చూపిస్తాను అని చెప్పి బయటకు పిలుచుకొని వెళ్లి పశువు ఊరిచే అమ్మాయిని చూపించి అలా చదువు సంధ్య లేకుండా ఇంటి పని చేసుకునే అమ్మాయి అయితే చాలు. అమ్మాయి నేను చెప్పినట్టు వినాలి అనడంతో ఇంతలో మ్యారేజ్ బ్యూరో మిడిల్ క్లాస్ అమ్మాయిని చూపించడంతో ఈ అమ్మాయి బాగుంది పెళ్లి చూపులకు ఏర్పాటు చేయండి అని అంటుంది. ఆ విక్రమ్ గాడు నా కాళ్ళ కింద చెప్పు అంటూ నోటికి వచ్చిన విధంగా మాట్లాడుతూ ఉంటుంది రాజ్యలక్ష్మి. ఒక వైపు లాస్య నందు దగ్గరికి వచ్చి ఏంటి నందు నువ్వు కూడా నన్ను అపార్థం చేసుకుంటున్నావు అనడంతో షటాప్ అని అంటాడు.

బతకడానికి డబ్బు అవసరం కానీ నీలా ఇలా తప్పుడు ఆలోచనలు చేయలేదు అంటూ లాస్య మీద సీరియస్ అవుతాడు నందు. తప్పుడు ఆలోచన కాబట్టి అజయ్ కి ముందే పెళ్లి అయింది అన్న విషయాన్ని అందరి దగ్గర దాచి దివ్య గొంతు కోయాలని చూసావు అని అంటాడు నందు. అయినా రెండో పెళ్లి చేసుకోవడం తప్ప అనడంతో ఇష్టపడి చేసుకుంటే బాగుంటుంది కానీ ఇలా నిజాలు దాచిపెట్టి కాదు అని లాస్యకీ వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు నందు. ఆ తర్వాత తులసి దివ్య బట్టల సర్దుతూ ఉండగా అప్పుడు దివ్య నువ్వు నాన్న కలిసి ఉన్నప్పుడు నువ్వు ఎంత సర్దుకు పోయినా కూడా నాన్న విడాకుల వరకు తీసుకువచ్చాడు.

కానీ ఇప్పుడు ఆ లాస్య ఆంటీ ఎన్ని తింగరి వేషాలు వేసినా ఎందుకు ఏమీ అనడం లేదు విడాకులు ఇవ్వచ్చు కదా అనడంతో తన సంగతి పక్కన పెట్టు అని అంటుంది తులసి. తర్వాత తులసి అక్కడ ర్యాక్ లో రెండు లక్షల రూపాయలు ఉండడం చూసి షాక్ అవుతుంది. ఎవరిది దివ్య అనడంతో అవి మన డబ్బులు కాదులే అమ్మ అక్కడ పెట్టే అని అంటుంది. మనవి కాదు అంటున్నావు అక్కడ పెట్టే అంటున్నావు అసలు ఏం జరిగింది అనగా అప్పుడు దివ్య జరిగింది మొత్తం వివరిస్తుంది. అప్పుడు పదేపదే విక్రం ని తలుచుకుంటూ ముఖంపై బొట్టు, పెదాలపై చిరునవ్వు, ముఖంలో ప్రశాంతత చూడడానికి మా రాముడు మంచి బాలుడు అన్న విధంగా ఉంటాడమ్మా అని విక్రమ్ ని పొగడగా అయితే నీకు నచ్చాడు అన్నమాట అని అంటుంది తులసి..