Intinti Gruhalakshmi: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి (Intinti Gruhalakshmi) సీరియల్ మంచి కాన్సెప్ట్ తో కొనసాగుతుంది. భర్తతో విడిపోయి కుటుంబం కోసం ఒంటరిగా పోరాడే మహిళ కాన్సెప్ట్ తో ప్రసారం అవుతున్న ఈ సీరియల్ ఈరోజు ఫిబ్రవరి 21వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో హైలెట్స్ తెలుసుకుందాం.
ఈరోజు ఎపిసోడ్ లో లాస్య ఆ తులసి నిన్ను కేఫ్ లాభాలలో షేర్ ఇవ్వమంటే ఇస్తావా అనగా అడిగితే అప్పుడు చూద్దాంలే అని అంటాడు నందు. చూద్దాంలే అంటే అర్థం ఏమిటి అనడంతో నువ్వు అన్నట్టు ఒకవేళ తులసి లాభాలు అడిగితే కచ్చితంగా ఇస్తాను ఎందుకంటే నాకంటే కేఫ్ కోసం తనే ఎక్కువగా కష్టపడుతుంది అనగా ఇంతలోనే అక్కడికి తులసి వస్తుంది. రా తులసి నీ గురించే మాట్లాడుకుంటున్నాము అనడంతో నా గురించి మాట్లాడుకోవడానికి ఏముంది అనగా నీది లక్కీ హ్యాండ్ అని చెబుతున్నాను తులసి అని అబద్ధాలు చెబుతుంది లాస్య.
అప్పుడు నందు నువ్వు నాతో కలిసి పని చేయొచ్చు కదా అనగా నేను పక్కన ఉన్నా కూడా ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నారు ఏంటిది అనుకుంటూ ఉంటుంది లాస్య. లాభాలలో 50% నీకు ఇస్తాను అనడంతో లాస్య షాక్ అవుతుంది. నాకు అటువంటి ఆలోచన లేదు కేఫై దారికి వచ్చేవరకు బాధగా తీసుకోవాలి అనుకున్నాను తీసుకున్నాను అంతే అని అంటుంది తులసి. అప్పుడు లాస్య ఊపిరి పీల్చుకుంటుంది. నా సొంత కాళ్ల మీద నిలబడాలి అనుకున్నాను ఇప్పుడు కాదు ఎప్పటికీ అలాగే ఉంటాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది తులసి.
అప్పుడు లాస్య ఏంటి బాబు తులసి తో బిజినెస్ చేద్దామనుకుంటున్నావా అనగా నేను నీకోసమే ఎలా మాట్లాడాను అని చెప్పి అక్కడినుంచి వెళ్ళిపోతాడు నందు. ఆ తర్వాత ఇంట్లో అందరూ కలిసి సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు నందు చాలా సంతోషంగా ఉంది ఎన్నో కష్టాలు ఒడిదుడుకుల తర్వాత నా ఫ్యామిలీ నాకు తోడుగా ఉంది. ఈరోజు నేను ఎప్పటికీ మర్చిపోలేను అని అనుకుంటూ ఉంటాడు. అప్పుడు లాస్య నాకు మళ్ళీ తులసి పిచ్చి పట్టినట్టు ఉంది అనుకుంటూ ఉంటుంది. అప్పుడు అందరూ కలిసి సరదాగా గేమ్ ఆడుతూ ఉండగా ఇంతలో నందుకి కంటిన్యూగా దగ్గు రావడంతో అప్పుడు ప్రేమ్ ప్రేమగా నీళ్లు తాపడంతో అది చూసి సంతోషపడుతూ ప్రేమ్ హత్తుకుంటాడు నందు.
అది చూసి లాస్య కుళ్ళుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత అనసూయ పరంధామయ్య ఫోన్ మోగుతూ ఉండగా లేవడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. అప్పుడు ఇది ఫోన్ లిఫ్ట్ చేసి మన దివ్య ఇంటికి రాబోతోంది అనడంతో అందరూ సంతోష పడుతూ ఉంటారు. ఆ తర్వాత ప్రేమ్ ఆడుకుంటూ ఉండగా ఇంతలో అక్కడికి శృతి వచ్చి మీ చెల్లెలు వస్తుంది అనగా బుగ్గ మీద ముద్దు పెట్టి చెప్తే నమ్ముతాను అనడంతో బాబు బుగ్గ మీద ముద్దు పెడుతుంది. తరువాత ప్రేమ్ నా చెల్లెలు మూడేళ్ల తర్వాత రాబోతుంది నేను వెళ్లి రెడీ అవుతాను అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత లాస్య ఇంట్లో ఎవరూ కనిపించకపోవడంతో అందరూ కలిసి ఎక్కడికి వెళ్లారు అనుకుంటూ ఉంటుంది.
ఇంతలో అనసూయ ఎక్కడికి రావడంతో ఇంట్లో వాళ్ళు ఎక్కడికి వెళ్లారు అనగా దివ్య డాక్టర్ చదువు పూర్తి చేసుకుని ఇంటికి రాబోతోంది అందుకే అందరూ కలిసి అక్కడికి వెళ్లారు అని ఉంటుంది. మరోవైపు తులసి సంతోషంతో గుడి దగ్గర కొబ్బరికాయలు కొడుతూ ఉంటుంది. అప్పుడు రాములమ్మ 108 కొబ్బరికాయలు కొట్టావు నా పని అయిపోయిందమ్మా ఇక నేను చేయలేను అని అంటుంది. పూజారి అక్కడికి వచ్చి ఏంటి తులసి అంత ఆనందంగా ఉన్నావు అనడంతో తులసి అమ్మ కూతురు దివ్య మూడేళ్ళ తర్వాత చదువు పూర్తి చేసుకుని ఇండియాకు వస్తోంది అందుకే ఇంత సంతోషంగా ఉంది అని చెప్పడంతో తులసి సంతోషపడుతూ ఉంటుంది.
ఆ తర్వాత తులసి దివ్య పేరు మీద గుడిలో అమ్మవారికి అర్చన చేయిస్తుంది. తొందరగా వెళ్ళు నువ్వు వెళ్లకపోతే నీ కూతురు అలాగే ఫ్లైట్ ఎక్కి అలాగే వెళ్ళిపోతుంది అనడంతో అవును కదా అని తులసి అక్కడి నుంచి సంతోషంగా బయలుదేరుతుంది. మరోవైపు నందు హెయిర్ కి కలలు వేసుకుంటూ ఉండగా ఇంతలో అక్కడికి లాస్య వచ్చి చిటపటలాడుతూ ఉంటుంది. అప్పుడు ఎందుకు ఇదంతా చేస్తున్నావు అనడంతో దివ్య వస్తుంది కదా అనగా ఆ విషయం తెలుసు అనడంతో మరి నాకెందుకు చెప్పలేదు అనగా నీకు తెలుసు అనుకున్నాను అంటాడు నందు. సరే బయలుదేరండి అనడంతో ఎక్కడికి అనగా దివ్య ను రిసీవ్ చేసుకోవడానికి ఎయిర్ పోర్ట్ కి వెళ్ళండి అని అంటుంది.
తులసి వెళ్ళింది అనడంతో తులసికి మాత్రమే కాదు నీకు కూడా కూతురు అందులోనే దివ్య ఇప్పుడు డాక్టర్ చదువు పూర్తి చేసి వస్తోంది నా మాట విని బయలుదేరు నందు అని చెప్పి నందు ఎక్కడి నుంచి పిలుచుకొని వెళ్తుంది. మరోవైపు ఒక పాప బెలూన్తో ఆడుకుంటూ ఉండగా కొందరు ఆకతాయి కావాలని ఆ బెలూన్స్ని పాపకు అందకుండా కట్ చేయడంతో ఇంతలో దివ్య అక్కడికి వచ్చి ఆ బిలన్స్ ని పట్టుకుని పాపకు అందిస్తుంది.
