Asianet News TeluguAsianet News Telugu

'టక్ జగదీష్': రిలీజ్ డేట్ పై రూమరే,నిర్మాత క్లారిటీ

థియేటర్లు రీఓపెన్ అయితే సినిమాలు అన్నీ వరుసగా రిలీజ్ కావడానికి సిద్ధంగా ఉన్నాయి. లవ్ స్టోరీ, టక్ జగదీష్, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, సీటిమార్ ఇతర చిత్రాలు వేసవిలో విడుదల కావాల్సింది. కానీ సెకండ్ వేవ్ కారణంగా ఆ చిత్రాలన్నీ తమ సినిమాల విడుదల వాయిదా వేసుకున్నాయి. అంతేకాకుండా థియేటర్లు రీఓపెన్ అయ్యేదాకా తమ సినిమాలను విడుదల చేసేది లేదంటున్నారు.

Tuck Jagadish: Makers deny release date rumors JSP
Author
Hyderabad, First Published Jul 17, 2021, 8:13 AM IST

లవ్ స్టోరీ, టక్ జగదీష్, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, సీటిమార్ ఇతర చిత్రాలు వేసవిలో విడుదల కావాల్సింది. కానీ సెకండ్ వేవ్ కారణంగా ఆ చిత్రాలన్నీ తమ సినిమాల విడుదల వాయిదా వేసుకున్నాయి. అంతేకాకుండా థియేటర్లు రీఓపెన్ అయ్యేదాకా తమ సినిమాలను విడుదల చేసేది లేదంటున్నారు. తాజాగా మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం కరోనా సెకండ్ వేవ్ తరువాత విడుదల కానున్న మొదటి చిత్రం నాని “టక్ జగదీష్”. ఈ చిత్రం జూలై 30న భారీ స్థాయిలో విడుదల కానుందని అన్నారు. అయితే ఆ రిలీజ్ డేట్ తాము ఫిక్స్ చేయలేందుటున్నారు నిర్మాతలు.  సినిమా రిలీజ్ గురించి మేకర్స్ తామే అధికారిక ప్రకటన చేస్తామన్నారు.

వాస్తవానికి ఈ మధ్యకాలంలో ఓ కొత్త ట్రెండ్ మొదలైంది. కరోనా ప్రభావంతో థియేట‌ర్లు తాత్కాలికంగా మూత‌బ‌డ‌టంతో షూటింగ్ పూర్తి చేసుకున్న ప్రతీ చిత్రం ఓటీటిలో విడుద‌ల‌వుతుందంటూ ప్ర‌చారం మొదలవుతోంది. వెంటనే ఆ సినిమా వాళ్లు సీన్ లోకి వచ్చి అబ్బే అదేం లేదు అని ప్రకటన ఇస్తున్నారు. తాజాగా  ‘ట‌క్ జ‌గ‌దీష్’ సినిమా కూడా ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ ప్ర‌సార హ‌క్కుల్ని సొంతం చేసుకుంద‌ని నెట్టింట వైర‌ల్ అయ్యింది.  వీటిపై స్పందించింది చిత్ర టీమ్ . ‘ట‌క్ జ‌గ‌దీష్’ చిత్రం థియేట‌ర్ల‌లోనే విడుద‌ల‌వుతుంది. అన‌ధికారిక వార్త‌ల్ని న‌మ్మ‌కండి’ అని స్ప‌ష్ట‌త ఇచ్చింది.

 ఇప్పుడు రిలీజ్ డేట్ పై వార్తలు మొదలయ్యాయి. అవి రూమర్స్ అని కొట్టి పారేసింది టీమ్. థియోటర్స్ పూర్తిగా ఓపెన్ కాకుండా ఎలా చేస్తామని అంటున్నారు. రాబోయే రెండు వారాల్లో సినిమాల రిలీజ్ కు సంబంధించిన వరుస అప్డేట్స్ రానున్నాయి అంటున్నారు. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు తిరిగి తెరవడం గురించి చర్చించడానికి అగ్ర నిర్మాతలు, పంపిణీదారులు రోజూ సమావేశమవుతున్నారు.

నేచురల్ స్టార్ నాని నటిస్తున్న తాజా చిత్రం టక్ జగదీష్.   కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కింది.   జగపతిబాబు నాని అన్న గా నటిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ‘టక్ జగదీష్’ పోస్టర్లు, పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.   'టక్ జగదీష్' చిత్రానికి 'నిన్ను కోరి' 'మజిలీ' వంటి సూపర్ హిట్ చిత్రాలను అందించిన శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో రీతూ వర్మ - ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి - హరీశ్ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నాని కెరీర్లో 26వ చిత్రంగా వస్తున్న 'టక్ జగదీష్' పై సినీ వర్గాల్లో మంచి అంచనాలే ఉన్నాయి.

Follow Us:
Download App:
  • android
  • ios