దగ్గుబాటి రానా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారని గత కొద్దిరోజులుగా మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం అమెరికాలో ఉన్న రానా కిడ్నీ మార్పిడి సర్జరీ కోసమే వెళ్లారని అన్నారు. అయితే తాజాగా కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స జరిగిందనే వార్త బలంగా వినిపిస్తోంది. రానాతో పాటు ఆయన తల్లి లక్ష్మి, చెల్లెలు మాళవిక అమెరికాలోనే 
ఉన్నారట.

రానాకి కిడ్నీ దానం చేయడానికే లక్ష్మీ అమెరికా వెళ్లారని, రానాకి సర్జరీ విజయవంతంగా జరిగిందని పలు వెబ్ సైట్లు వార్తలు రాశాయి. 'బాహుబలి' సినిమా షూటింగ్ సమయంలోనే రానాకి కిడ్నీ సమస్య తలెత్తిందని, 'బాహుబలి' కోసం కఠినమైన కసరత్తులు చేయడంతో రానా శరీరంలోని సోడియం లెవెల్స్ పడిపోయాయని ఇలా రకరకాలుగా  వార్తలు వినిపించాయి.

అప్పట్లో రానా హైదరాబాద్, ముంబై లోని మల్టీస్పెషాలిటీ హాస్పిటల్స్ లో చికిత్స తీసుకున్నారని సమాచారం. కానీ కిడ్నీ సమస్య నయం కాకపోవడంతో మార్పిడి ఒక్కటే పరిష్కారమని వైద్యులు సూచించారట. దీంతో ఆయన అమెరికాకు వెళ్లి సర్జరీ చేయించుకున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తల్లో నిజం లేదని కొట్టిపారేశారు రానా.

ఈ క్రమంలో ఇన్స్టాగ్రామ్ లో ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు రానా బదులిచ్చాడు. 'డియర్ కామ్రేడ్'సినిమా విడుదల నేపధ్యంలో విజయ్ దేవరకొండకి విషెస్ చెప్పడానికి రానా తన అకౌంట్ లో ఓ వీడియో పోస్ట్ చేశారు. ఇది చూసిన ఓ నెటిజన్ కిడ్నీ సర్జరీ గురించి ప్రశ్నించారు. ఆరోగ్యం బాగానే ఉందా..? అని రానాని సదరు అభిమాని ఆరా తీయగా.. 'అలాంటి వార్తలు చదవడం మానేయండి' అంటూ రిప్లై ఇచ్చాడు రానా.

అతడి మాటలను బట్టి తనకు ఎలాంటి ఆపరేషన్ జరగలేదని తెలుస్తోంది. కానీ అభిమానులు  అనవసరంగా కంగారు పడతారని కావలనే ఈ సర్జరీ విషయాన్ని సీక్రెట్ ఉంచాలని భావిస్తున్నట్లు మరికొందరు అంటున్నారు. ప్రస్తుతం రానా.. గుణశేఖర్ దర్శకత్వంలో ఓ సినిమా అలానే 'విరాటపర్వం' అనే మరో సినిమాలో నటిస్తున్నాడు. 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

#dearcomrade #Rowdy @thedeverakonda my best to you and your team @rashmika_mandanna

A post shared by Rana Daggubati (@ranadaggubati) on Jul 23, 2019 at 12:44pm PDT