`థగ్‌ లైఫ్‌` చిత్రంలో హీరోయిన్‌ త్రిష కీలక పాత్రలో కమల్‌ హాసన్‌కి లవ్‌ ఇంట్రెస్ట్ గా నటించింది. అయితే ఇందులో ఆమె పాత్రపై విమర్శలు వస్తోన్నాయి.  ట్రోల్స్ చేస్తున్నారు.

స్టార్‌ హీరోయిన్‌ త్రిష సౌత్‌ ఇండస్ట్రీలో టాప్‌ హీరోయిన్లలో ఒకరు. ఆమె సీనియర్లతోపాటు స్టార్‌ హీరోల సరసన కూడా నటిస్తోంది. రెండు తరాల హీరోలను బ్యాలెన్స్ చేస్తోంది. అటు సీనియర్లకి సెట్‌ అవుతోంది. ఇటు యంగ్‌ హీరోల సరసన కూడా మంచి జోడీగా కుదురుతోంది. దీంతో వరుసగా ఆఫర్లని అందుకుంటూ దూసుకుపోతోంది త్రిష.

`థగ్‌ లైఫ్‌`తో ఆడియెన్స్ ముందుకు వచ్చిన త్రిష 

తాజాగా త్రిష `థగ్‌ లైఫ్‌` చిత్రంతో ఆడియెన్స్ ముందుకు వచ్చింది. ఇందులో కమల్‌ హాసన్‌ హీరోగా నటించగా, శింబు ముఖ్య పాత్ర పోషించారు. నాజర్‌, జోజూ జార్జ్, అశోక్‌ సెల్వన్‌ వంటివారు కీలక పాత్రలు పోషించారు. గురువారం విడుదలైన ఈ మూవీకి మిశ్రమ స్పందన లభిస్తోంది.

`థగ్‌ లైఫ్‌`లో త్రిష రోల్‌పై ట్రోల్స్ 

అయితే ఇందులో త్రిష పాత్రపై విమర్శలు వస్తున్నాయి. సోషల్‌ మీడియాలో ఆమెని ట్రోల్‌ చేస్తున్నారు. సినిమాలో ఇంద్రాణి పాత్రని త్రిష ఎందుకు చేసిందని అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ట్రోలర్స్ మరో అడుగు ముందుకేసి రెచ్చిపోతున్నారు. సినిమాలోని ఆమె సీన్లని పోస్ట్ చేస్తూ రచ్చ చేస్తున్నారు.

`థగ్‌ లైఫ్‌`లో వేశ్యగా ఎందుకు చేశారని త్రిషని ప్రశ్నిస్తున్న అభిమానులు 

త్రిష పాత్ర సినిమా కథకి సంబంధం లేదు. ఆమెని కేవలం గ్లామర్‌ సైడ్‌ మాత్రమే ఉపయోగించారు. ఇందులో త్రిష ఉంపుడుగత్తెని తలపించే పాత్రలో కనిపిస్తుంది. ఒక స్టార్‌ హీరోయిన్‌గా రాణిస్తున్న ఆమె ఇలాంటి పాత్ర చేయాల్సిన అవసరం ఏంటి? అని ప్రశ్నిస్తున్నారు. 

త్రిష, కమల్‌ హాసన్‌ ల మధ్య రొమాంటిక్‌ సీన్లు కూడా నప్పేలా లేవని కామెంట్‌ చేస్తున్నారు. ట్రైలర్‌ వచ్చినప్పుడే 70ఏళ్ల నటుడితో 42ఏళ్ల హీరోయిన్‌ రొమాన్స్ ఏంటంటూ విమర్శలు గుప్పించారు.ఇప్పుడు కూడా అదే వాదన తెరపైకి తీసుకొస్తున్నారు. ఇందులో ఈ రొమాన్స్ అవసరమా అంటున్నారు.

`థగ్‌ లైఫ్‌`లో త్రిష పాత్రపై సీన్లు కట్‌ చేశారా?

ముఖ్యంగా త్రిష పాత్ర విషయంలో ఆమె అభిమానులు చాలా డిజప్పాయింట్‌ అవుతున్నారు. సినిమాలో త్రిషకి చాలా ప్రయారిటీ ఉందట. ఆమె వేశ్య వృత్తికి సంబంధించిన బాధ కలిగించే గతం ఉంటుంది, అలాగే సంగీత ప్రపంచంలో రాణించేలా ఆమె పాత్ర ఉంటుందట. 

కానీ ఆ సన్నివేశాలన్నీ తొలగించారు. ఈ విషయంలో కమల్‌, మణిరత్నలను కూడా ట్రోల్‌ చేస్తున్నారు. ఇలా అటు త్రిష, ఇటు `థగ్ లైఫ్‌` మూవీ ట్రోల్స్ కి గురవుతుంది. ఇవన్నీ సినిమాపై నెగటివ్‌ ప్రభావాన్ని చూపిస్తున్నాయి.