బాలకృష్ణ ఊర్వశి బట్టలు ఉతుకుతున్నాడా? `డాకు మహారాజ్‌` సాంగ్‌, శేఖర్‌ మాస్టర్‌పై క్రేజీ ట్రోల్స్

బాలకృష్ణ నటించిన `డాకు మహారాజ్‌` నుంచి `దబిడి దిబిడి`సాంగ్‌ విడుదలైంది. అయితే తాజాగా ఈ పాట ట్రోలర్స్‌ బారిన పడింది. శేఖర్‌ మాస్టర్‌ని ఉతికి ఆరేస్తున్నారు. 
 

trolls on balakrishna starrer dabidi dibidi song and sekhar master arj

లార్జర్‌ దెన్‌ లైఫ్‌ కి కేరాఫ్‌ బాలయ్య..

బాలకృష్ణ సినిమాలంటేనే లార్జర్‌ దెన్‌ లైఫ్‌ అనేలా ఉంటాయి. మనుషులకు సాధ్యం కానిది బాలయ్య సినిమాల్లో చేసి చూపిస్తారు. దాదాపు రెండు దశాబ్దాలుగా బాలయ్య సినిమాలు ఇలానే ఉంటున్నాయి. ఆడియెన్స్ వాటినే ఇష్టపడుతున్నారు. ఎంజాయ్‌ చేస్తున్నారు. సోషల్‌ మీడియాలో బాలయ్య డైలాగులు, యాక్షన్‌ సీన్లు బాగా వైరల్‌ అవుతుంటాయి. మీమర్స్, ట్రోలర్స్ బీభత్సంగా వాడుతుంటారు. ఏది ఎలా ఉన్నా బాలయ్య సినిమాలు ఆడియెన్స్ ని క్రేజీగా ఎంటర్‌టైన్‌ చేస్తాయని చెప్పడంలో అతిశయోక్తి లేదు. 

trolls on balakrishna starrer dabidi dibidi song and sekhar master arj

`దబిడి దిబిడి` సాంగ్‌పై ట్రోల్‌..

ఇదిలా ఉంటే తాజాగా బాలయ్య సినిమా `డాకు మహారాజ్‌` ట్రెండింగ్‌లోకి వచ్చింది. ఈ మూవీలోని `దబిడి దిబిడి` సాంగ్‌ ని ట్రోల్‌ చేస్తున్నారు. ఈ పాట గురువారం విడుదల చేసింది టీమ్‌. శేఖర్‌ మాస్టర్‌ కొరియోగ్రఫీ చేసిన ఈ పాటకి థమన్‌ మ్యూజిక్‌ అందించారు. బాలయ్య, ఊర్వశి రౌతేలా మీద ఈ పాటని చిత్రీకరించారు. ఈ పాట కోసమే ఊర్వశీని తీసుకోవడం విశేషం. ప్రస్తుతం ఈ పాట నెట్టింట పెద్ద రచ్చ చేస్తుంది. దానికి కారణం ఇందులోని కొన్ని స్టెప్పులు. 

read more: SSMB 29: 1000 కోట్ల బడ్జెట్, రాజమౌళి, మహేష్ వాటా ఎంతో తెలుసా.. అంతర్జాతీయ ఒప్పందాలు ఇవే ?

శేఖర్‌ మాస్టర్‌పై విమర్శలు..

ఊర్వశీ రౌతేలాపై బాలయ్య వెనకాల నుంచి చేతులతో కొడుతున్నట్టుగా ఉన్న మూమెంట్లని బాగా ట్రోల్‌ చేస్తున్నారు నెటిజన్లు. అత్యంత దారుణంగా ఈ కొరియోగ్రఫీ ఉందని కామెంట్‌ చేస్తున్నారు. ముఖ్యంగా డాన్స్ మాస్టర్‌ శేఖర్‌ మాస్టర్‌ని ఆడుకుంటున్నారు. అరేయ్‌ ఇదేం కొరియోగ్రఫీరా నాయనా అంటూ రచ్చరచ్చ చేస్తున్నారు. ఊర్వశీ బట్టలు బాలయ్య ఉతుకుతున్నాడా? లేద దెబ్బలు కొడుతున్నాడా? అంటున్నారు. కొందరు ఇంకాస్త ముందుకు వెళ్లి `దెబ్బలు పడతయ్‌ రో` అంటూ `పుష్ప 2`లోని శ్రీలీల పాట లిరిక్‌ని జోడిస్తున్నారు. 

trolls on balakrishna starrer dabidi dibidi song and sekhar master arj

వైరల్‌ గా దబిడి దిబిడి సాంగ్‌..

బూతులతో అటు శేఖర్‌ మాస్టర్‌ని, ఇటు డైరెక్టర్‌ని ఆడుకుంటున్నారు. బాలయ్యతో ఇలాంటి చెత్త స్టెప్పులు చేయిస్తారా? అంటూ దారుణంగా కామెంట్లు చేస్తున్నారు. దీంతో ఇప్పుడు `దబిడి దిబిడి` పాట సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. పాజిటివ్‌గా అయినా, నెగటివ్‌గా అయినా ఇది తెగ వైరల్‌గా మారి సినిమాకి కావాల్సినంత ప్రమోషన్‌ తెచ్చిపెడుతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇప్పుడున్న ట్రెండ్‌లో.. నెగటివ్‌ ప్రచారమే సినిమాకి బాగా ప్లస్‌ అవుతుండటం విశేషం. 

సంక్రాంతికి `డాకు మహారాజ్‌` సందడి..

 ఇక బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న `డాకు మహారాజ్‌` మూవీ సంక్రాంతికి కానుకగా విడుదల కాబోతుంది. జనవరి 12న దీన్ని రిలీజ్‌ చేస్తున్నారు. ఇందులో బాలయ్యకి జోడీగా ప్రగ్యాజైశ్వాల్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. శ్రద్ధా శ్రీనాథ్‌ కీలక పాత్రలో నటిస్తుంది. బాబీ డియోల్‌ నెగటివ్‌ రోల్‌ పోషిస్తున్నారు. నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. డాకుల కథాంశంతో పీరియాడ్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా దీన్ని తెరకెక్కించారు దర్శకుడు బాబీ. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ టీజర్‌, ట్రైలర్‌లకు విశేషస్పందన లభించింది. సినిమాపై అంచనాలను పెంచింది. మరి సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి. 

read more: `పుష్ప 2` ఐదు చోట్ల ఫ్లాప్‌, రెండు చోట్ల హిట్‌, ఆ ఒక్క ఏరియాలో సంచలనం

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios