`పుష్ప 2` ఐదు చోట్ల ఫ్లాప్, రెండు చోట్ల హిట్, ఆ ఒక్క ఏరియాలో సంచలనం
`పుష్ప 2` సినిమాకి సంబంధించిన సరికొత్త వాదన తెరపైకి వచ్చింది. ప్రపంచమంతా బ్లాక్ బస్టర్‌గా చెబుతున్న ఈ మూవీ ఐదు చోట్ల ఫ్లాప్ అని, రెండు చోట్ల హిట్ అని, ఒక్క చోట మాత్రమే సంచలనంగా చెబుతున్నారు.
`పుష్ప 2` సినిమా సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఈ మూవీ ఇండియన్ సినిమాలోనే సరికొత్త సంచలనం సృష్టిస్తుంది. ఇంకా సరికొత్త రికార్డుల దిశగా వెళ్తుంది. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ రూపొందించిన `పుష్ప 2` డిసెంబర్ 5న విడుదలైన విషయం తెలిసిందే. ఇంకా థియేటర్‌లో విజయవంతంగా రన్ అవుతుంది. అన్ని రికార్డులను బ్రేక్ చేసి చరిత్ర సృష్టించేందుకు రెడీ అవుతుంది.
`పుష్ప 2` సినిమా కలెక్షన్లలో ఇప్పటికే 1700కోట్లు దాటింది. సంక్రాంతి వరకు పెద్దగా సినిమాలు లేకపోవడంతో ఇది `బాహుబలి 2` లాంగ్ రన్ రికార్డుల(1800కోట్లు)ను బ్రేక్ చేయబోతుందని తెలుస్తుంది. ఇక మిగిలింది `దంగల్` మాత్రమే. ఇది రెండు వేల కోట్లు కలెక్ట్ చేసింది. మరి ఈ రికార్డులను బ్రేక్ చేస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది. కానీ ఓ కమర్షియల్ సినిమా ఈ రేంజ్‌లో కలెక్షన్ల సునామీ సృష్టించడం షాకిస్తుంది. ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తుంది.
ఇదిలా ఉంటే ఈ మూవీ ఏరియా వైజ్‌గా చూస్తే మాత్రం చాలా చోట్ల ఫ్లాప్ అంటున్నారు. ఓవరాల్‌గా చూస్తే బ్లాక్ బస్టర్‌గా నిలిచిన ఈ మూవీ ఏరియాల పరంగా మాత్రం మేజర్‌గా ఫెయిల్ అయ్యిందంటున్నారు. ఈ మూవీ నార్త్ ఇండియాలోనే బాగా ఆడుతుంది. హిందీ మార్కెట్‌లోనే దుమ్మురేపుతుంది. నార్త్ మార్కెట్ లో ఈ మూవీ వెయ్యి కోట్లు దాటింది. అన్ని బాలీవుడ్ సినిమాల రికార్డులను బ్రేక్ చేసింది. కానీ సౌత్‌లో మాత్రం ఫెయిల్ అయ్యింది. అల్లు అర్జున్‌కి సెకండ్ ల్యాండ్‌గా చెప్పుకునే కేరళాలోనూ ఇది డిజాస్టర్ కావడం షాకిస్తుంది.
also read: శోభన్ బాబు భోజనంలో ప్రతిరోజూ వడ పాయిసం.. ప్రొడక్షన్ బాయ్ చేత అంత అవమానం ఫేస్ చేశాడా?
అంతేకాదు ఏపీలోనూ ఈ మూవీ లాస్‌లోనే ఉందట. బయ్యర్లకి డబ్బులు రాలేదట. ఇంకా బ్రేక్ ఈవెన్ కూడా కాలేదని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. సీడెడ్‌లోనూ అదే పరిస్థితి. అక్కడ కూడా బ్రేక్ ఈవెన్ కాలేదట. నైజాం(తెలంగాణ)లో మాత్రం సేఫ్ అయ్యిందని అంటున్నారు. అలాగే కర్నాటకలో ఈ మూవీ బాగానే చేసిందట. అడ్వాన్స్ లు ఇచ్చిన వారికి బ్రేక్ ఈవెన్ అయ్యాయని చెబుతున్నారు. కానీ తమిళనాడులో మాత్రం ఫ్లాప్ అనే అంటున్నారు.
అక్కడ కూడా బయ్యర్లకి డబ్బులు రాలేదట. ఇలా ఈ నాలుగు ఏరియాలోనూ సినిమా బయ్యర్లకి లాస్‌లోనే ఉందట. దీంతోపాటు నార్త్ అమెరికాలో కూడా ఈ మూవీకి డబ్బులు రాలేదని, కొన్న రేట్ ఇంకా బ్రేక్ ఈవెన్ కాలేదని చెబుతున్నారు. ఓవరాల్ ఓవర్సీస్‌లో హిట్ అయినా, నార్త్ అమెరికాలో మాత్రం ఇంకా స్ట్రగుల్ అవుతూనే ఉందని చెబుతున్నారు. కానీ ఇతర దేశాల్లో మాత్రం సినిమా బాగానే ఆడిందని సమాచారం.
ఇక హిందీలోనే ఎందుకు ఆడిందంటే.. `పుష్ప 2` పూర్తి మాస్ మూవీ. రా అండ్ రస్టిక్‌గా ఉంటుంది. క్యారెక్టర్ బేస్డ్ ఫిల్మ్. బిహార్, ఛత్తీస్‌ఘడ్, జార్ఖాండ్, ఉత్తరప్రదేశ్, మధ్య ప్రదేశ్, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్ వంటి ఏరియాలో ఆడియెన్స్ ఇలాంటి మాస్ క్యారెక్టర్ బేస్ సినిమాలను ఇష్టపడతారు. మేజర్‌గా జనం జీవన విధానం దీనికి దగ్గరగా ఉంటుంది. మాస్ ఆడియెన్స్ ఉన్న రాష్ట్రాలు ఇవి. అందుకే సినిమాకి బ్రహ్మరథం పడుతున్నారు. నార్త్ లో ఈ మూవీ పది రూపాయలకు వంద రూపాయల చేయడం విశేషం.
నార్త్ ఇండియాలో ఆడకపోతే ఇది బిగ్గెస్ట్ డిజాస్టర్ జాబితాలో చేరేది. కానీ అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ ఈ విషయాన్ని ముందే ఊహించారు. వారి కోసమే, వాళ్లు కనెక్ట్ అయ్యేలానే యాక్షన్ ఎలిమెంట్లు పెట్టారు. హీరో పాత్రని డిజైన్ చేశారు. వాళ్లు అనుకున్న టార్గెట్ రీచ్ అయ్యారు. అక్కడ `పుష్ప 2` విలయతాండవం చేస్తుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. కానీ తెలుగు ఆడియెన్స్ కి, సౌత్ ఆడియెన్స్ కి ఇది పెద్దగా ఎక్కలేదని సమాచారం.