`జాతిరత్నాలు` సినిమా ఇటీవల విడుదలై విజయవంతంగా దూసుకుపోతుంది. దాదాపు. యాభై కోట్ల కలెక్షన్లని రాబట్టినట్టు తెలుస్తుంది. బడ్జెట్‌కి పదిరెట్లు ఈ సినిమా కలెక్షన్లని సాధించడంతో ఇండస్ట్రీ వర్గాలు మొత్తం షాక్‌కి గురవుతుంది. నవీన్‌ పొలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్‌ రామకృష్ణ ప్రధాన పాత్రధారులగా ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి అనుదీప్‌ దర్శకత్వం వహించారు. సినిమా భారీ కలెక్షన్లతో రన్‌ అవుతున్న నేపథ్యంతో నిర్మాతలు కాస్ట్ లీ కార్‌ని గిఫ్ట్ గా ఇచ్చారు దర్శకుడికి. 

నిర్మాతలు ప్రియాంకదత్‌, స్వప్నా దత్‌లు, నాగ్‌ అశ్విన్‌లు దర్శకుడు అనుదీప్‌కి కార్‌ ని గిఫ్ట్ గా ఇస్తూ ఫోటోని పంచుకున్నారు. కాస్టీలీ లంబోర్గిని కారుని గిఫ్ట్ గా ఇవ్వడం వరకు బాగానే ఉంది, కానీ ఇది చూసి నెటిజన్లు మాత్రం షాక్‌కి, ఆశ్చర్యానికి గురవుతున్నారు. సినిమా కోట్లకు కోట్లు వసూలు చేస్తుంటే వీళ్లేంటీ బొమ్మ కారును బహుమతిగా ఇవ్వడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల `ఉప్పెన` చిత్రంతో బ్లాక్‌ బస్టర్‌ అందించిన బుచ్చిబాబుకి దాదాపు కోటి విలువ చేసే రేంజ్‌ రోవర్‌ కారుని గిప్ట్ ఇచ్చారు నిర్మాతలు. 

కానీ `జాతిరత్నాలు` దర్శకుడికి మాత్రం బొమ్మ కారుని గిఫ్ట్ గా ఇవ్వడంతో నెటిజన్లు రిగిలిపోతున్నారు. వరుసగా ట్రోల్స్, మీమ్స్ తో రెచ్చిపోతున్నారు. `నా పంచులతో అందరినీ ఫూల్స్ చేస్తుంటే.. వీళ్లు బొమ్మ కారిచ్చి నన్నే ఫూల్‌ని చేస్తున్నారు`, `మీ సినిమా టీమ్‌ అందరు ఏదో తేడాగా ఉన్నారే` అంటూ బ్రహ్మానందం ఫోటో పెట్టి చేసిన మీమ్స్ ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. మరి వీళ్లు నిజమైనే కారు ఇస్తారా? లేదా? అన్నది చూడాలి.