సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తె సౌందర్య రజనీకాంత్ తరచుగా వార్తల్లో నిలుస్తున్నారు. ఈ ఏడాది ఆమె రెండవ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. నటుడు, వ్యాపారవేత్త అయిన విశాగన్ తో ఆమె రెండవ వివాహం జరిగింది. మాజీ భర్త అశ్విన్ తో విభేదాల కారణంగా సౌందర్య విడిపోయింది. 

ఇటీవల సౌందర్య రజనీకాంత్ తన కొడుడు వేద్ తో స్విమ్మింగ్ చేస్తున్న ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫొటోతో సౌందర్య రజనీకాంత్ నెటిజన్ల నుంచి తీవ్రమైన వ్యతిరేకత ఎదుర్కొన్నారు. ఓ వైపు చెన్నై నగరం నీటి సమస్యతో అలాడుతుంటే.. ఇలా స్విమ్మింగ్ పూల్ లో ఎంజాయ్ చేస్తూ ఆ ఫోటోలు షేర్ చేస్తావా అంతో అభిమానులు విమర్శలు గుప్పిస్తున్నారు. 

విమర్శలు ఎక్కువవుతుండడంతో సౌందర్య రజనీకాంత్ ఆ ఫోటోని తొలగించి వివరణ ఇచ్చారు. ప్రస్తుతం ఉన్న నేటి సమస్యని అర్థం చేసుకుని ఫోటో తొలగిస్తున్నాను. చిన్నపిల్లలు ఈత నేర్చుకోవాలనే ఉద్దేశంతోనే ఆ ఫోటో షేర్ చేసినట్లు సౌందర్య పేర్కొంది. 

సౌందర్య రజనీకాంత్ తమిళ చిత్ర పరిశ్రమలో గ్రాఫిక్ డిజైనర్ గా మంచి గుర్తింపు సొంతం చేసుకున్నారు. దర్శకురాలిగా మాత్రం ఆమె విజయం సాధించలేకపోయారు. సౌందర్య దర్శకత్వం వహించిన కొచ్చాడియాన్ చిత్రం నిరాశపరిచిన సంగతి తెలిసిందే.