వ్యక్తిగత విహార యాత్రల్లో ఎవరు ఎలా ఉండాలో మరొకరు చెప్పడానికి ఎలాంటి అర్హత ఉండదు. కానీ వాటికి సంబంధించిన ఫొటోలు జనాలందరితో షేర్ చేసుకునేటప్పుడు మాత్రం కాస్త జాగ్రత్తగానే ఉండాలి. సెలబ్రిటీలు ఇంకాస్త ఎక్కువ కేర్ తీసుకోవాలి. లేకపోతే సమంతల తిట్లు తినాల్సి వస్తుంది.

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సమంత ఎప్పటికప్పుడు తన ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. అయితే ఇప్పుడు అక్కినేని ఇంటి కోడలు అయిన తరువాత ఆమెపై ఫోకస్ పెరిగింది. ఆమె కాస్త పొట్టి బట్టలు వేసుకున్నా.. నెటిజన్లు యాక్సెప్ట్ చేయడం లేదు. అక్కినేని వారింటి కోడలికి ఇది పద్ధతేనా అంటూకామెంట్స్ చేస్తున్నారు.

ఇప్పటికే చాలా సార్లు సమంతను తన డ్రెస్సింగ్ విషయంలో నెటిజన్లు ట్రోల్ చేశారు. తాజాగా మరోసారి ఈ బ్యూటీని టార్గెట్ చేశారు. తన భర్త నాగచైతన్య కొందరు స్నేహితులతో కలిసి సరదాగా విహారయాత్ర కోసం స్పెయిన్ వెళ్లింది సామ్. సముద్ర తీర ప్రాంతంలో  సేద తీరుతూ ఓ ఫోటో తీసుకొని సోషల్ మీడియాలో షేర్ చేసింది.

తన భర్తే ఆ ఫోటో తీసినట్లు చెప్పింది. కానీ ఇందులో సామ్ డ్రెస్ మరీ చిన్నదిగా ఉండడంతో ఆమెపై నెగెటివ్ కామెంట్స్ మొదలయ్యాయి.గ్లామర్, సెక్సీనెస్ పై మరీ అంత ఆసక్తి ఉంటే పెళ్లి ఎందుకు చేసుకోవడమని విమర్శిస్తున్నారు. పద్ధతి, సంప్రదాయం అంటూ క్లాస్ పీకుతున్నారు. అయినా తన భర్త నాగచైతన్యకు లేని కష్టం జనాలకు ఏమొచ్చిందో..!

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Pc @chayakkineni 💚

A post shared by Samantha Akkineni (@samantharuthprabhuoffl) on Aug 27, 2019 at 5:02am PDT