'బాహుబలి' చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నటుడు ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఈ సినిమాతో పాటు మరో ప్రేమకథను కూడా ఓకే చేశాడు. 'జిల్' ఫేం దర్శకుడు రాధాకృష్ణ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు.

నిన్న మొన్నటివరకు 'సాహో' షూటింగ్ చేసిన ప్రభాస్..ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో నటిస్తోన్న సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు. దీనికోసం ప్రభాస్ కొత్త లుక్ ట్రై చేశాడు. ఎప్పుడు తన లుక్స్ విషయంలో ప్రయోగాల జోలికి పోని ప్రభాస్ ఈ సినిమా కోసం క్లీన్ షేవ్ తో కొత్త హెయిర్ కట్ తో కనిపిస్తున్నాడు. 

ఇప్పటివరకు కాస్త రఫ్ లుక్ తో చూసిన ప్రభాస్ కి ఈ కొత్త గెటప్ సూట్ అవ్వలేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇటీవల ప్రభాస్.. కృష్ణంరాజు పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనడం తన కొత్త లుక్ బయటకొచ్చింది. ఈ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ప్రభాస్ ని ట్రోల్ చేస్తున్నారు. మాచో మ్యాన్ కాస్త ఇలా తయారయ్యాడేంటి..? అంటూ నెగెటివ్ కామెంట్స్ చేస్తున్నారు.

స్క్రీన్ మీద ఈ లుక్ ఎలా ఉంటుందో కానీ ఇప్పుడైతే ప్రభాస్ ని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లో సినిమా షూటింగ్ జరుగుతోంది. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాను నాలుగైదు భాషల్లో విడుదల చేయాలని అనుకుంటున్నారు.