మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన 'ఒడియన్' సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎన్నడూ లేని విధంగా కేరళలో ఈ సినిమా ప్రీరిలీజ్ బిజినెస్ జరిగింది. కేరళలో ఈ సినిమాను వెయ్యి స్క్రీన్ లలో విడుదల చేశారు.

తెలుగు, తమిళ భాషల్లో కూడా ఈ సినిమాపై క్రేజ్ పెరిగింది. తెలుగు థియేట్రికల్ రైట్స్ దాదాపు రూ.5 కోట్లకు అమ్ముడయ్యాయి. నిన్న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను నిరాశ పరిచింది. తొలి ఆట నుండే ఈ సినిమాకి నెగెటివ్ టాక్ రావడం మొదలైంది. కథ బాగుందని సరిగ్గా ఎగ్జిక్యూట్ చేయలేకపోయారని కామెంట్స్ చేస్తున్నారు.

మలయాళ సినీ పరిశ్రమలో ఈ సినిమా రికార్డులు బద్దలు కొడుతుందనుకుంటే కనీసం సినిమాపై పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ సినిమాను ఓ రేంజ్ లో వేసుకుంటున్నారు.

ముఖ్యంగా మోహన్ లాల్ యాంటీ ఫ్యాన్స్ సినిమాపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ కథను అంత బడ్జెట్ అవసరమా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. బాలీవుడ్ లో 'థగ్స్ ఆఫ్ హిందూస్తాన్', మలయాళంలో 'ఒడియన్' ల ఫ్లాప్ ల ముందు మరే సినిమా నిలవలేదంటూ జోక్స్ వేస్తున్నారు.