నందమూరి బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ లు ఒకరితో ఒకరు కలిసిపోయి తమ మధ్య ఎలాంటి విబేధాలు లేవని ఈ మధ్యకాలంలో చాలా సందర్భాల్లో చెప్పారు. అయినప్పటికీ ఎన్టీఆర్ మీద మాత్రం సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఆగడం లేదు.

దీనికి కారణం ఏంటంటే..? ఇటీవల ఎన్టీఆర్ బయోపిక్ విడుదలైన సంగతి తెలిసిందే. సినిమా రిజల్ట్ సంగతి పక్కన పెడితే మంచి ప్రయత్నం చేశారని అందరూ మెచ్చుకున్నారు. ఇండస్ట్రీ నుండి చాలా మంది హీరోలు ఈ బయోపిక్ పై కామెంట్స్ చేశారు.

కానీ ఎన్టీఆర్ మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఈ విషయంలో బాలయ్య అభిమానులు హర్ట్ అయ్యారట. రీసెంట్ గా ఎన్టీఆర్ 23వ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ సమాధి వద్దకు తన అన్నయ్య కళ్యాణ్ రామ్ తో కలిసి వెళ్లాడు తారక్. తాతయ్య సమాధి వద్ద కూర్చొని ఆయన జ్ఞాపకాలను గుర్తుతెచ్చుకొని ఎమోషనల్ అయ్యారు.

దీనికి సంబంధించిన ఫోటోలు చూసిన కొందరు బాలయ్య అభిమానులు ఎన్టీఆర్ బయోపిక్ గురించి పట్టించుకోవు కానీ తాత సమాధి దగ్గర ఏడుస్తూ నాటకాలు ఆడుతున్నావా అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఎన్టీఆర్ కథానాయకుడు ప్రీరిలీజ్ ఈవెంట్ కి ఎన్టీఆర్ వచ్చినప్పటికీ సినిమాపై కామెంట్ చేయకపోవడంతో బాలయ్య, ఎన్టీఆర్ ల మధ్య ఏదో జరిగుంటుందని అంటున్నారు.