ఎన్టీఆర్ బయోపిక్ సినిమాను 12 సార్లు సార్లు చూస్తానని సినిమా విడుదలకు ముందు దర్శకుడు రాఘవేంద్రరావు చేసిన వ్యాఖ్యలను పట్టుకొని ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. 

ఎన్టీఆర్ తనకు 12సార్లు అవకాశాలు ఇచ్చారని కాబట్టి ఎన్టీఆర్ బయోపిక్ ని పన్నెండు సార్లు చూస్తానని సినిమా ఆడియో విడుదల కార్యక్రమంలో రాఘవేంద్రరావు కొన్ని కామెంట్స్ చేశారు. దీంతో ఇప్పుడు కొందరు నెటిజన్లు 12 సార్లు సినిమా చూసే దమ్ము మీకుందా..? అంటూ రాఘవేంద్రరావుని ప్రశ్నిస్తున్నారు.

'మహానాయకుడు' సినిమా సంగతి తరువాత ముందు 'కథానాయకుడు' సినిమా ఎన్ని సార్లు చూశారో చెప్పాలంతో డిమాండ్ చేస్తున్నారు. ప్రతీ విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండే రాఘవేంద్రరావు ఈసారి ట్రోలింగ్ కి అడ్డంగా బుక్కైపోయారు.

ఇక 'మహానాయకుడు' సినిమా విషయానికొస్తే సోమవారం నుండి ఈ సినిమా పరిస్థితి మరీ దారుణంగా మారింది. కనీసం థియేటర్ల రెంట్లు కూడా కట్టలేని స్థితిలో ఉన్నారు. మూడు రోజులకు గాను ఈ సినిమా కేవలం మూడు కోట్లనే వసూలు చేసింది.