సినీ నిర్మాత బండ్ల గణేష్.. కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. ఈసారి ఎలెక్షన్స్ లో అతడికి టికెట్ దక్కుతుందని అనుకున్నాడు కానీ కుదరలేదు. అయినప్పటికీ తెలంగాణా ఎన్నికల్లో గెలుపు మాదేనంటూ కాలర్ ఎగరేసి మరీ చెప్పాడు.

ఎలెక్షన్ ఫలితాలు తమకు అనుకూలంగా రాకపోతే గనుక గొంతు కోసుకుంటానని బహిరంగంగా కామెంట్స్ చేశాడు.ఈ మాటలే ఇప్పుడు బండ్ల గణేష్ ని చిక్కుల్లో పడేశాయి. ఈరోజు ఉదయం ఎన్నికల కౌంటింగ్ మొదలైన సంగతి తెలిసిందే.

అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పటికే ఎన్నికల ఫలితాలు టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉందని స్పష్టంగా తెలుస్తోంది. ఈ ఎలెక్షన్స్ లో టీఆర్ఎస్ గెలుపు ఖాయమని అందరూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఇప్పుడు అందరి దృష్టి బండ్ల గణేష్ పై పడింది. తమ పార్టీ ఓడిపోతే గొంతు కోసుకుంటానని చెప్పిన బండ్ల గణేష్ ఎక్కడ అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. 

కనపడుటలేదు.. పేరు బండ్ల గణేష్.. వివరాలు ఇవే అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ చేస్తున్నారు. మాట మీద నిలబడే దమ్ముందా..? అంటూ బండ్ల గణేష్ ని ప్రశ్నిస్తున్నారు. మరి ఈ విమర్శలపై బండ్ల గణేష్ ఎలా స్పందిస్తాడో చూడాలి!