బాలీవుడ్ లో ఏ హీరో ఎదుర్కోనన్ని విమర్శలు ఎదుర్కుంటుంటాడు హీరో అభిషేక్ బచ్చన్. ఈ మధ్యకాలంలో ఆయన కెరీర్ లో ఒక్క హిట్ కూడా పడలేదు. ఆయన పరిస్థితి మరీ గోరంగా మారింది. తాజాగా ఆయన నటించిన 'మన్మర్జియా' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు మిశ్రమ స్పందన లభించింది.

అయితే ఈ సినిమా రిజల్ట్ పై కామెంట్ చేసిన ఓ నెటిజన్.. ''మంచి సినిమాను కూడా ఫ్లాప్ చేయగల సత్తా ఒక్క అభిషేక్ బచ్చన్ కి మాత్రమే ఉందని మరోసారి రుజువైంది. ఇలాంటి నైపుణ్యాలు అందరికీ ఉండవు. బాలీవుడ్ లో వారసత్వాలకు గుడ్ బై చెప్పాల్సిన సమయం వచ్చేసింది. అభిషేక్ తో పాటు ఇతర స్టార్ కిడ్స్ కూడా వెళ్లి వడాపావ్ వ్యాపం చేసుకోవాలి. 'స్త్రీ' సినిమా బ్లాక్ బస్టర్ విజయం అందుకొని ప్రతిభని చాటుతోంది'' అంటూ ట్వీట్ చేశాడు.

ఈ ట్వీట్ పై స్పందించిన అభిషేక్ బచ్చన్ సదరు నెటిజన్ కి ధీటు సమాధానమిచ్చాడు. ''మీలాంటి గౌరవమైన వుత్తిలో ఉన్నవారు బాక్సాఫీస్ లెక్కలు, నిజానిజాలు తెలుసుకొని మాట్లాడాలి. కనీసం మీ దగ్గరకి వచ్చే రోగులతోనైనా సరిగ్గా వ్యవహరిస్తారని ఆశిస్తున్నాను'' అంటూ రిప్లయ్ చేయగా..

సదరు నెటిజన్.. ''ఇలాంటి ట్వీట్ చేయడం వలన నాకు సిగ్గుగా అనిపించడం లేదు. వరుసగా పదహారు ఫ్లాప్ లు ఇచ్చిన నటులు సిగ్గుపడాలి. మీరు మంచి మనిషే కావొచ్చు.. కానీ భయంకరమైన యాక్టర్''అన్నారు.