Asianet News TeluguAsianet News Telugu

మహేష్ సినిమా షూటింగ్ పక్కన పెట్టి... క్రికెట్ ఆడుతున్న త్రివిక్రమ్ శ్రీనివాస్

కాసేపు క్రికెటర్ గా మారిపోయాడు డైరెక్టర్  త్రివిక్రమ్ శ్రీనివాస్.. షూటింగ్ అంతా పక్కన పెట్టేసి.. సరదాగా గేమ్ ఆడుకున్నాడు. ఇంతకీ త్రివిక్రమ్ కు క్రికెట్ మీద ఎందుకు ఆలోచన మళ్లింది.

Trivikram Srinivas playing Cricket in SSMB28 Shooting
Author
First Published Feb 3, 2023, 2:59 PM IST

దాదాపు రెండు ఏళ్లుగా నానుతుంది మహేష్ బాబు, త్రివిక్రమ్ మూవీ. అసలు షూటింగే లేట్ అయ్యిందంటే.. ఏదో ఒక అడ్డంకితో షూటింగ్ కు బ్రేక్ పడుతూ వస్తోంది. ఇక ఎట్టకేలకురీసెంట్ గా ఫ్రెష్ శెడ్యూల్ ను స్టార్ట్ చేసుకున్నారు టీమ్. సినిమాను సూపర్ ఫాస్ట్ గా కంప్లీట్ చేయాలని చూస్తున్నారు. ఈక్రమంలోనే ఈ సినిమా షూటింగ్ కు సబంధించిన ఏదో ఒక అప్ డేట్ లీక్అవుతూనే ఉంది. తాజాగా ఈమూవీకి సబంధించిన ఒక విషయం వైరల్ అవుతోంది. 

తాజాగా SSMB28 షూటింగ్ బ్రేక్ సమయంలో త్రివిక్రమ్ క్రికెట్ ఆడుతునూ చిల్ అవుతున్న ఒక వీడియో బయటకి వచ్చింది. డైరెక్టర్ మైక్ పట్టుకొని యాక్షన్ కట్..  పేకప్ అంటూ చెప్పే దర్శకుడు..  బ్యాట్ పట్టుకొని బాల్‌తో బౌండరీలు కొట్టడం సెట్ లో ఉన్నవారికి ఆశ్చర్యాన్ని కలిగించింది.  బ్రేక్ టైములో సెట్ లో ఉన్న జూనియర్ ఆర్టిస్ట్ లతో కలిసి కాసేపు సరదాగా క్రికెట్ ఆడుతూ ఎంజాయ్ చేశాడు త్రివిక్రమ్. ఇక ఇందుకు సంబంధించిన వీడియోలను కొందరు నెట్టింట పోస్ట్ చేయగా, ప్రస్తుతం అవి వైరల్ గా మారాయి.

 

ఈ సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబు న్యూ లుక్ లో ఫ్యాన్స్ కు సరి కొత్త ట్రీట్ ఇవ్వబోతున్నాడు అని తెలుస్తుంది. ఈ చిత్రంలో మహేష్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా... మరో హీరోయిన్ గా  శ్రీలీల  స్క్రీన్ షేర్ చేసుకోబోతుంది. ఇక మూడో  హీరోయిన్ సంయుక్త మీనన్ ఒక కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తుంది. ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కాబోతున్నట్టు సమాచారం. గతంలో త్రివిక్రమ్, మహేష్ కలయికలో వచ్చిన అతడు, ఖలేజా మంచి విజయాలు సాధించాయి. ప్రస్తుతం వీరిద్దరూ కూడా సక్సెస్ ట్రాక్ లో ఉండడంతో ఈ చిత్రం పై భారీ అంచనాలే నెలకొన్నాయి. 

సర్కారు వారి పాట తర్వాత మహేష్ బాబు నటిస్తోన్న ఈ సినిమా కోసం ఇప్పటికే ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమా తర్వాత సూపర్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేయబోతున్నారు. పారెస్ట్ అడ్వెంచర్ నేపథ్యంలో ఈ సినిమా రాబోతున్నట్లు ఇప్పటికే జక్కన్న ప్రకటించడంలో భారీ అంచనాలు నెలకొన్నాయి.మరి ఆ అంచనాలని త్రివిక్రమ్ అందుకోగలడా? లేదా? అనేది చూడాలి.
 

Follow Us:
Download App:
  • android
  • ios