Asianet News TeluguAsianet News Telugu

లగ్జరీ కారు కొన్న త్రివిక్రమ్.. భార్యకి గిఫ్ట్ ఇచ్చారా, ధర తెలిస్తే మైండ్ బ్లాకే..

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ వెండితెరపై చేసే మాయాజాలం ఎలా ఉంటుందో అందరికి తెలుసు. మాస్, క్లాస్ అని తేడా లేకుండా ప్రతి ఒక్కరిని త్రివిక్రమ్ చిత్రాలు అలరిస్తుంటాయి.

Trivikram Srinivas buys new luxury car
Author
First Published Dec 2, 2022, 2:44 PM IST

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ వెండితెరపై చేసే మాయాజాలం ఎలా ఉంటుందో అందరికి తెలుసు. మాస్, క్లాస్ అని తేడా లేకుండా ప్రతి ఒక్కరిని త్రివిక్రమ్ చిత్రాలు అలరిస్తుంటాయి. ప్రస్తుతం త్రివిక్రమ్.. సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఓ చిత్రం చేస్తున్నారు. 

ఇప్పటికే ఈ చిత్ర షూటింగ్ ప్రారంభం అయింది. అయితే త్రివిక్రమ్ ఈ కథలో మార్పులు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇటీవల మహేష్ తండ్రి సూపర్ స్టార్ కృష్ణ మరణించడంతో షూటింగ్ కి గ్యాప్ వచ్చింది. త్రివిక్రమ్, మహేష్ కాంబోలో వస్తున్న ఈ చిత్రం హైవోల్టేజ్ యాక్షన్ మూవీగా ఉండబోతున్నట్లు సమాచారం. 

ఇదిలా ఉండగా తాజాగా త్రివిక్రమ్ శ్రీనివాస్ ఓ లగ్జరీ కారుని కొన్నారు. ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. త్రివిక్రమ్ శ్రీనివాస్, ఆయన సతీమణి సౌజన్య ఇద్దరూ షో రూమ్ వద్ద కారు ఎదుట నిలబడి కీస్ తీసుకుంటున్న దృశ్యాలు వైరల్ గా మారాయి. త్రివిక్రమ్ బీఎండబ్ల్యూ 7 సిరీస్ మోడల్ కారుని కొనుగోలు చేశారు.  

దీని ధర దిమ్మతిరిగేలా ఉంది. ఈ కారు విలువ దాదాపు 1.4 కోట్లు. త్రివిక్రమ్ ఈ కారుని తన భార్య సౌజన్యకి గిఫ్ట్ గా కొన్నారనే ప్రచారం జరుగుతోంది. త్రివిక్రమ్ సతీమణి సౌజన్య అప్పుడప్పుడూ వార్తల్లో నిలుస్తుంటారు. ఆమె క్లాసికల్ డ్యాన్సర్. దీనితో ఆమె పలు వేదికలపై నృత్య ప్రదర్శన ఇవ్వడం చూస్తూనే ఉన్నాం. 

ఏది ఏమైనా త్రివిక్రమ్, మహేష్ బాబు మూవీ అప్డేట్ కోసం ఫ్యాన్స్ అంతా ఎదురుచూస్తున్నారు. మహేష్, త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ మూవీ ఇది. గతంలో అతడు, ఖలేజా చిత్రాలు వీరి కాంబినేషన్ లోనే వచ్చాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios